البحث

عبارات مقترحة:

الرحمن

هذا تعريف باسم الله (الرحمن)، وفيه معناه في اللغة والاصطلاح،...

الرحيم

كلمة (الرحيم) في اللغة صيغة مبالغة من الرحمة على وزن (فعيل) وهي...

الحسيب

 (الحَسِيب) اسمٌ من أسماء الله الحسنى، يدل على أن اللهَ يكفي...

ఇస్లాం ధర్మంపై కొన్ని ప్రశ్నోత్తరాలు

التلجوية - తెలుగు

المؤلف ముహమ్మద్ కరీముల్లాహ్ ، షేఖ్ నజీర్ అహ్మద్
القسم كتب وأبحاث
النوع نصي
اللغة التلجوية - తెలుగు
المفردات الدعوة إلى الإسلام - شبهات حول الإسلام
ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

التفاصيل

ఇస్లాం ధర్మంపై కొన్ని ప్రశ్నోత్తరాలు ఇస్లాం ధర్మంపై కొన్ని ప్రశ్నోత్తరాలు అవిశ్వాసులు ఎక్కడ కనబడితే అక్కడ వారిని చంపండి అని బోధిస్తున్న ఖుర్ఆన్ వచనం వలన ఇస్లాం ధర్మం హింస, రక్తపాతం మరియు క్రూరత్వాన్ని ప్రోత్సహించడం లేదా?  ఒకవేళ అల్లాహ్ యే స్వయంగా అవిశ్వాసుల హృదయాలపై సీలు వేసేసినాడని పేర్కొన్నప్పుడు, ఇస్లాం స్వీకరించటం లేదని వారిని ఎందుకు నిందించాలి?  ఇస్లాం ధర్మం ఖడ్గం ద్వారా వ్యాపించిందా ? ఎందుకు అనేకమంది ముస్లింలు ఫండమెంటలిష్టులుగా మరియు ఉగ్రవాదులుగా పేర్కొనబడు తున్నారు? ఎందుకు ముస్లిమేతరులను కాఫిర్లని పిలుస్తూ ముస్లింలు వారిని దూషిస్తున్నారు?  ఇస్లాం ధర్మంపై కొన్ని ప్రశ్నోత్తరాలు ఇస్లాం ధర్మంపై కొన్ని ప్రశ్నోత్తరాలు అవిశ్వాసులు ఎక్కడ కనబడితే అక్కడ వారిని చంపండి అని బోధిస్తున్న ఖుర్ఆన్ వచనం వలన ఇస్లాం ధర్మం హింస, రక్తపాతం మరియు క్రూరత్వాన్ని ప్రోత్సహించడం లేదా? ఇస్లాం ధర్మం హింసను ప్రోత్సహిస్తుందని మరియు తనను అనుసరించని ముస్లిమేతరులను చంపమని తన అనుచరులను ప్రేరేపిస్తుందని కొందరు నిరంతరం చేసే తమ తప్పుడు ప్రచారాన్ని సమర్ధించుకునేందుకు ప్రత్యేకంగా ఎంచుకున్న కొన్ని ఖుర్ఆన్ వచనాలను తరుచుగా పేర్కొంటూ ఉంటారు.1. సూరహ్ అత్తౌబాలోని వచనం ఇస్లాం ధర్మం హింస, రక్తపాతం మరియు క్రూరత్వాన్ని ప్రోత్సహిస్తుందంటూ ఇస్లాం ధర్మ విమర్శకులు సూరహ్ తౌబా లోని క్రింది వచనాన్ని తరుచుగా పేర్కొంటూ ఉంటారు: "ఎక్కడ కనబడితే అక్కడ ముష్రికులను (బహుదైవారాధకులు, అవిశ్వాసులను) చంపండి." [ఖుర్ఆన్ 9:5]2. ఈ వచనం అవతరించింది యుద్ధభూమిలోవాస్తవానికి ఇస్లాం ధర్మ విమర్శకులు దీని ముందు – వెనుక వచనాల్ని వదిలి పెట్టి, తమ వాదనకు సమర్ధన లభించే విధంగా ఈ వచనాన్ని మాత్రమే పేర్కొంటూ ఉంటారు. ఆ వచనం అవతరించిన సందర్భాన్ని అర్థం చేసుకునేందుకు, ఈ అధ్యాయం యొక్క మొదటి వచనం నుండి చదవ వలసి ఉంటుంది. ముస్లింల మరియు మక్కాలోని ముష్రికుల (బహుదైవారాధకుల) మధ్య సంధి ఒడంబడిక ఆచరణలో ఉండిందని, మక్కా ముష్రికులు దానిని ఉల్లంఘించారని, సంధి ఒడంబడికను పునరుద్ధరించడానికి మక్కా ముష్రికులకు నాలుగు నెలల సమయం ఇవ్వబడిందని, వారలా చేయని యెడల వారిపై యుద్ధం ప్రకటించబడుతుందని దీనికి ముందు వచ్చిన వచనాలు తెలుపుతున్నాయి. సూరహ్ తౌబాలోని 5వ వచనం ఇలా ప్రకటిస్తున్నది: "కానీ, నిషిద్ధమైన నెలలు దాటి పోయిన తర్వాత, బహుదైవారాధకులు ఎక్కడ కనబడితే అక్కడ వారిని వధించండి, మరియు వారిని ఖైదీలుగా బంధించండి, వారిని ఇబ్బంది పెట్టండి, మరియు అవకాశం ఉన్న ప్రతి చోటా వారి గురించి కాపు కాయండి; అయితే ఒకవేళ వారు క్షమాపణ వేడుకుని, రెగ్యులర్ గా నమాజు చేస్తుంటే మరియు రెగ్యులర్ దానధర్మాలు చేస్తుంటే, వారి కొరకు దారి తెరవండి: అల్లాహ్ అత్యంత క్షమించేవాడు, అత్యంత దయామయుడు." [దివ్యఖుర్ఆన్ 9:5]వారి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ వచనం అవతరించింది.3. ఉదాహరణకు - అమెరికా మరియు వియత్నాం మధ్య జరిగిన యుద్ధంఒకసారి అమెరికా వియత్నాంతో యుద్ధం చేసిందనే విషయం మనకు తెలుసు. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు లేదా అమెరికన్ ఆర్మీ జనరల్ ఇలా ప్రకటించాడని అనుకుందాము: "ఎక్కడ మీకు వియత్నామీయులు కనబడితే అక్కడ వారిని చంపండి". సందర్భం చెప్పకుండా అమెరికన్ అధ్యక్షుడు, "ఎక్కడ మీకు వియత్నామీయులు కనబడితే అక్కడ వారిని చంపండి" అని చెప్పారని ఈరోజు నేనంటే ఆయన ఒక కసాయివాడనే అభిప్రాయం మీకు కలుగుతుంది. కానీ నేను సందర్భం చెప్పి, ఆ తర్వాత ఆయన పలుకులు మీకు వినిపిస్తే, ఆయన మాటలు చాలా లాజికల్ గా కనబడతాయి. ఎందుకంటే ఆ యుద్ధసమయంలో ఆయన అమెరికన్ సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు, వారిలో ధైర్యాన్ని నూరి పోసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రహించగలరు. 4. అలాగే యుద్ధరంగంలోని ముస్లిం సైనికుల ధైర్యం పెంచేందుకు ఈ వచనం 9:5 అవతరించిందిఅలాగే సూరహ్ తౌబాలోని 5వ వచనం, "మీకు ముష్రికులు ఎక్కడ కనబడితే అక్కడ వారిని చంపండి", అనే వచనం యుద్ధభూమిలోని ముస్లింల ధైర్యాన్ని  పెంచేందుకు అవతరించింది. యుద్ధంలో భయపడవద్దని, శత్రువు ఎక్కడ కనబడితే అక్కడ అతడిని చంపమని ముస్లిం సైనికులకు ఇక్కడ ఖుర్ఆన్ చెబుతున్నది.5. అరుణ్ శౌరీ ఈ అధ్యాయంలోని 6వ వచనాన్ని వదిలి పెట్టి, తిన్నగా 5వ వచనం నుండి 7వ వచనం పైకి దూకినాడుభారతదేశంలోని ఇస్లాం ధర్మ తీవ్రవిమర్శకులలో ఒకడు అరుణ్ శౌరీ.  ‘The World of Fatwahs’ అనే తన పుస్తకంలోని 572వ పేజీలో అతడు ఖుర్ఆన్ లోని సూరహ్ తౌబాలోని 5వ మరియు 7వ వచనాల్ని పేర్కొన్నాడు. కొంచెమైనా తెలివి ఉన్న వారెవరైనా అతడు 6వ వచనాన్ని వదిలి వేసాడనే విషయాన్ని తేలిగ్గా గ్రహించగలరు.6. సూరహ్ తౌబాలోని 6వ వచనం దాని సమాధానం ఇస్తున్నది.ఇస్లాం ధర్మం హింస, రక్తపాతం మరియు క్రూరత్వాన్ని ప్రోత్సహిస్తుందనే అసత్య ఆరోపణకు సూరహ్ తౌబాలోని 6వ వచనం ఇలా సమాధానం ఇస్తున్నది: "ఒకవేళ బహుదైవారాధకులలో ఎవరైనా శరణు అడిగితే, వెంటనే వారికి శరణు ప్రసాదించండి. తద్వారా అతడు అల్లాహ్ యొక్క వచనాలు వినవచ్చు; మరియ అతడిని సురక్షిత ప్రాంతం వరకు స్వయంగా చేర్చండి ఎందుకంటే వారు సరైన జ్ఞానం లేనివారు."   [ఖుర్ఆన్ 9:6]  యుద్ధరంగంలో శరణు కోరిన ముష్రికు (బహుదైవారధకుడు) కు శరణు ప్రసాదించాలి, అంతేగాక అతడిని సురక్షిత ప్రాంతానికి స్వయంగా తీసుకు వెళ్ళి వదలాలి అని ఖుర్ఆన్ తెలుపుతున్నది. ఈనాటి అంతర్జాతీయ రణరంగంలో, ఒక శాంతికాముకుడైన ఆర్మీ జనరల్ యుద్ధ సమయంలో శత్రు సైనికులు ఒకవేళ శాంతిని కోరుకుంటే, వారిని అక్కడి నుండి వెళ్ళిపోనిస్తాడే గానీ, వారిని సురక్షిత స్థానానికి చేర్చమని తన సైనికులను ఆదేశిస్తాడా?   ప్రపంచంలో శాంతిని స్థాపించేందుకు అల్లాహ్ ఖుర్ఆన్ లో దీనినే ఆదేశించాడు. ఒకవేళ అల్లాహ్ యే స్వయంగా అవిశ్వాసుల హృదయాలపై సీలు వేసేసినాడని పేర్కొన్నప్పుడు, ఇస్లాం స్వీకరించటం లేదని వారిని ఎందుకు నిందించాలి? నిరంతరం సత్యాన్ని తిరస్కరిస్తున్న వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేసేసినాడని ఖుర్ఆన్ లోని రెండవ అధ్యాయమైన సూరహ్ అల్ బఖరహ్ లోని 6 మరియు 7 వ వచనాలలో ఇలా పేర్కొనబడింది : "ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో, వారిని నీవు హెచ్చరించినా , హెచ్చరించక పోయినా ఒకటే; వారు విశ్వసించరు. వారి హృదయాలపై అల్లాహ్ సీలు వేసినాడు మరియు వారి చెవులపై. వారి కళ్ళపై పరదా ఉంది; వారి కొరకు కఠినమైన శిక్ష ఉంది."  [ఖుర్ఆన్ 2:6-7]ఈ వచనాలు సత్యాన్ని తిరస్కరిస్తున్న సామాన్య అవిశ్వాసుల గురించి కాదు. ఇక్కడ వాడబడిన అరబీ పదాలు ‘అల్లదీన కఫరూ’ అంటే ఎవరైతే సత్యాన్ని తిరస్కరించే వైపు మొగ్గినారో అని అర్థం. అలాంటి వారిని మీరు హెచ్చరించినా లేక హెచ్చరించక పోయినా ఒకటే, ఎందుకంటే వారు విశ్వసించరు. అల్లాహ్ వారి హృదయాలను మరియు వారి చెవులను సీలు చేసేసినాడు, వారి చూపులపై పరదా వేసేసినాడు. వారు విశ్వసించకపోవటానికి, అర్థం చేసుకోక పోవటానికి కారణం వారి హృదయాలపై సీలు వేయబడటం కాదు. దీనికి విరుద్ధంగా వాస్తవానికి వారి అవిశ్వాసం వలన మరియు అర్థం చేసుకోక పోవటం వలన వారి హృదయాలపై మరియు చెవులపై సీలు వేయబడింది. ఈ అవిశ్వాసులు సత్యతిరస్కారం వైపు పోవటానికి ముందుగానే నిర్ణయించుకుని ఉండటం వలన వారిని హెచ్చరించినా,  హెచ్చరించకపోయినా వారు విశ్వసించరు అనే కారణం వలన అల్లాహ్ వారి హృదయాలను సీలు చేసినాడు. కాబట్టి సత్యతిరస్కారం వైపు వంగిపోయిన ఈ అవిశ్వాసులే దీనికి స్వయంగా బాధ్యులని నిందించాలే గానీ, అల్లాహ్ ను కాదు.  ఉదాహరణ - తన క్లాసులోని ఒక విద్యార్థి పరీక్ష తప్పుతాడనే ఒక టీచర్ జోస్యం చెప్పడం.  ఉదాహరణకు ఫైనల్ పరీక్షల ముందు సరిగ్గా క్లాసులలో ఏకాగ్రత చూపకపోవటం, హోమ్ వర్క్ సరిగ్గా చేయకపోవడం, దురలవాట్లు కలిగి ఉండటం మొదలైన కారణాల వలన ఫలానా విద్యార్థి  పరీక్షలలో తప్పుతాడని ఒక అనుభవజ్ఞుడైన టీచర్ జోస్యం చెప్పాడని అనుకుందాము. పరీక్షలు వ్రాసిన తర్వాత ఆ విద్యార్థి ఒకవేళ టీచర్ చెప్పినట్లుగానే ఫెయిల్ అయితే ఎవరిని నిందించాలి – టీచర్ నా లేక స్టూడెంటునా? కేవలం టీచర్ జోస్యం చెప్పడం వలననే ఆ విద్యార్థి తప్పాడని టీచర్ ను నిందించడం సమంజసం కాదు గదా! పరీక్ష తప్పడానికి స్వయంగా ఆ విద్యార్థియే కారణం అనేది ఎవ్వరూ తిరస్కరించలేని సత్యం.  అలాగే సత్యతిరస్కారం వైపు మొగ్గుచూపే కొందరు వ్యక్తుల గురించి అల్లాహ్ కు ముందుగానే తెలుసు. అందువలన ఆయన వారి హృదయాలపై ముద్ర వేసినాడు. కాబట్టి సత్యాన్ని తిరస్కరించటానికి మరియు అల్లాహ్ ను విశ్వసించక పోవటానికి అసలు బాధ్యులు స్వయంగా ఈ అవిశ్వాసులే.1.    ఇస్లాం ధర్మం సోమరితనం మరియు అజ్ఞానంతో కూడిన సమాజాన్ని తయారు చేస్తుందా? ఎందుకంటే:Ø  ప్రతిదీ అల్లాహ్ నుండే వస్తుంది కాబట్టి అన్నింటికీ కర్మవాదం, అదృష్టం, విధివ్రాత మొదలైనవి కారణమనే వాదనలపై ఆధారపడటం Ø  ఆధునిక టెక్నాలజీ మరియు సైన్సులను ఖండించడం.ఈ అపోహకు ఇవ్వబడిన కారణాలు అసత్యమైనవి. వాస్తవానికి ఖుర్ఆన్ మరియు సున్నతులు స్వయంగా తిన్నగా ఈ భ్రమనే ఖండించాయి. మా కొరకు సృష్టికర్తే అన్నింటికీ మూలం అనేది నిజమే అయినప్పటికీ, ఈ క్రింది ఖుర్ఆన్ వచనాలలో పేర్కొనబడినట్లుగా వెనక దాక్కోటానికి దీనిని ఒక కారణంగా మానవజాతి వాడుకోవచ్చనటంలో ఏ మాత్రం నిజం లేదు,[16:35] అసత్య దేవుళ్ళ ఆరాధకులు ఇలా పలుకుతారు: "ఒకవేళ అల్లాహ్ తలిస్తే, మేము అల్లాహ్ ను కాకుండా ఇతరులెవ్వరినీ ఆరాధించేవారము కాదు – మేమే కాదు మా తండ్రులు కూడా – ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండేవారము కూడా." తర్వాత వారు తమకు పూర్వం వచ్చిన వారినే అనుసరించారు. మరి, వారికి స్పష్టమైన సందేశం బోధించటం తప్ప ప్రవక్తల పని మరేమిటి ?[43:20] వారు (బహుదైవారాధకులు) ఇలా అన్నారు, "ఒకవేళ అత్యంత దయామయుడైన అల్లాహ్ తలిస్తే, మేము అలాంటి వాటిని ఆరాధించేవారము కాము!" వాటి గురించి వారికేమీ తెలియదు: వారి చెప్పేది అబద్ధం తప్ప మరేమీ కాదు!మానవులందరూ నిర్ణీత ప్రమాణంలో స్వేచ్ఛ కలిగి ఉన్నట్లు ఖుర్ఆన్ మరియు సున్నతుల ద్వారా అల్లాహ్ మనకు బోధించినాడు. ఖుర్ఆన్ మరియు సున్నతుల పద్ధతిని అనుసరిస్తూ మన సృష్టికర్తను ప్రసన్నం చేసుకునేందుకు ఈ పరిమిత స్వేచ్ఛను తప్పకుండా వాడుకోవాలి. ముస్లిములందరూ అత్యంత జ్ఞానవంతులుగా, ప్రభావశీలులైన ముస్లింలుగా మారటానికి ఆవశ్యకమైనంత ప్రేరణ ఇందులో ఉంది. ఈనాడు ముస్లిం సమాజాలు తమ అసలు ఔన్నత్యానికి చేరుకోలేక పోతున్నాయంటే దానికి కారణం ఖచ్ఛితంగా వారి ఇస్లామీయ జ్ఞాన లోపం కాదు. ఇలాంటి జీవన విధానం గురించి వారు గ్రహించక పోవటమే అసలు కారణం. సున్నతులలో జ్ఞానాన్ని సంపాదించటం మరియు కష్టపడి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతల గురించి స్పష్టంగా తెలుపబడింది. ప్రత్యేకంగా సునన్ అబూ దాఊద్ లో పేర్కొనబడిన ఈ హదీథును శ్రద్ధగా పరిశీలించండి: [9:1637] అనస్ బిన్ మాలిక్ ఇలా ఉల్లేఖించారు: ఒక అన్సారీ సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఏదైనా ఇవ్వమని ఆయనను యాచించారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని ఇలా అడిగారు: నీ ఇంట్లో ఏమీ లేదా? దానికి అతడిలా జవాబిచ్చాడు: ఉంది, ఒక వస్త్రం ముక్క ఉంది - దానిలోని కొంత భాగాన్ని మేము కప్పుకుంటాము, మరికొంత భాగాన్ని నేలపై పరుస్తాము, మరియు ఒక చెక్క గిన్నె ఉంది – దానిలో మేము నీళ్ళు త్రాగుతాము. ఆయన అతడితో ఇలా అన్నారు: వాటిని నా వద్దకు తీసుకురా. అపుడు అతడు వాటిని ఆయన వద్దకు తీసుకురాగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని తన చేతుల్లో తీసుకుని ప్రజల వైపు తిరిగి ఇలా పలికారు: వీటిని ఎవరు కొంటారు? అది విని ఒక వ్యక్తి ఇలా అన్నాడు: నేను వాటిని ఒక దిర్హమ్ ధరకు కొంటాను. ఆయన రెండు మూడు సార్లు ప్రజలను ఇలా అడిగారు: ఒక దిర్హమ్ కంటే ఎక్కువ ధర ఎవరు ఇస్తారు? అపుడు మరో వ్యక్తి ఇలా అన్నాడు: నేను వాటిని రెండు దిర్హమ్ లకు కొంటాను.ఆయన వాటిని అతడికి ఇచ్చి, రెండు దిర్హమ్ లు తీసుకున్నారు. వాటిని ఆ అన్సారీ సహాబీకు ఇచ్చి, ఇలా పలికారు: ఒక దిర్హమ్ తో తినే పదార్థాలు కొని ఇంట్లో ఇవ్వు, మరో దిర్హమ్ తో ఒక గొడ్డలి కొని నా దగ్గరకు తీసుకురా. అలాగే అతడు గొడ్డలి కొని ఆయన వద్దకు తీసుకు వచ్చాడు. అపుడు అల్లాహ్ యొక్క ప్రవక్త స్వయంగా తన చేతితో ఆ గొడ్డలిపై చేతిపిడి బిగించి, అతడితో ఇలా అన్నారు: వెళ్ళు, వంటచెరుకు జమ చేసి, దానిని అమ్ముకో. పదిహేను రోజుల వరకు నా కంటికి కనబడకు. అ వ్యక్తి వంట చెరుకు జమ జేసి, అమ్మటం ప్రారంభించాడు. అతడు పది దిర్హమ్ లు సంపాదించిన తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు – కొన్ని దిర్హమ్ లతో దుస్తులు మరియు మరి కొన్ని దిర్హమ్ లతో ఆహారపదార్థాలు కొన్నాడు. అపుడు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: నీ కోసం ఇది అడుక్కోవడం కంటే మంచిది. ఎందుకంటే అడుక్కోవడమనేది తీర్పుదినాన నీ ముఖం పై ఒక మచ్చగా కనబడుతుంది. అడుక్కోవడం కేవలం ముగ్గురి కొరకు తగును: కటిక దరిద్రంలో పిండి అవుతున్నవాడు, ఘోరంగా అప్పుల్లో కూరుకు పోయినవాడు మరియు వాపసు చేయవలసిన ధనం లేక ఇబ్బంది పడుతున్నవాడు.అలాగే ‘జ్ఞానం సంపాదించడమనేది ప్రతి ముస్లింపై ఉన్న బాధ్యత’ అనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను సునన్ ఇబ్నె మాజాహ్ లోని ఈ హదీథు ఉల్లేఖిస్తున్నది. ఖుర్ఆన్ మరియు సున్నతుల జ్ఞానం స్పష్టంగా అన్నింటి కంటే అత్యంత ఉత్తమమైన జ్ఞానం మరియు మానవజాతికి ఎక్కువ ప్రయోజనం కలుగజేసే జ్ఞానం. ఖుర్ఆన్ మరియు సున్నతులు ఈ భూమండలం గురించి పరిశోధించ వద్దని నిరోధించడం లేదు. వాస్తవానికి, క్రింది ఖుర్ఆన్ వచనం ప్రకారం, మనం జీవిస్తున్న ఈ సువిశాల ప్రపంచం గురించి క్షుణ్ణంగా పరిశోధించమని సృష్టికర్త మనల్ని ప్రోత్సహిస్తున్నాడు,[3:190-191] జాగ్రత్త! భూమ్యాకాశాల సృష్టిలో మరియు రాత్రింబవళ్ళ మార్పులో, తప్పకుండా అర్థం చేసుకునే ప్రజల కొరకు చిహ్నాలు ఉన్నాయి. ప్రజలలో ఎవరైతే నిలుచుని, కూర్చొని, ప్రక్కలపై పడుకుని అల్లాహ్ ను కొనియాడుతూ ఉంటారో, భూమ్యాకాశాల సృష్టిలోని అబ్బురాల గురించి దీర్ఘంగా ఆలోచిస్తారో అలాంటి వారు ఇలా వేడుకుంటారు: "మా ప్రభూ! నీవు వీటన్నింటినీ వృథాగా సృష్టించలేదు! నీవు ఎంతో ఘనమైన వాడివి! నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడు." ఇస్లాం ధర్మం ఖడ్గం ద్వారా వ్యాపించిందా ?ఇస్లాం ధర్మం సైనిక బలం ద్వారా వ్యాపించి ఉండకపోతే, నేడు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అవలంబీకులను కలిగి ఉండేది కాదని కొందరు ముస్లిమేతరులు సర్వసాధారణంగా చేసే ఒక ఫిర్యాదు. ఖడ్గ బలం ద్వారా వ్యాపించింది అనటంలో ఏ మాత్రం నిజం లేదనీ, వాస్తవానికి దాని సహజసిద్ధమైన, స్వాభావికమైన, అంతర్గతమైన ‘సత్యబలం’, హేతువు (REASON) మరియు తర్కం (LOGIC) మొదలైనవే దాని శీఘ్ర వ్యాప్తికి అసలు కారణాలనీ క్రింది అంశాలు స్పష్టంగా ఋజువు చేస్తున్నాయి. 1.   ఇస్లాం అంటే శాంతి, సమర్పణ.ఇస్లాం అనే పదం సలామ్ అనే మూల పదం నుండి వచ్చింది. సలామ్ అంటే శాంతి అని అర్థం. దీని మరో అర్థం స్వయంగా తన ఇష్టాన్ని అల్లాహ్ కు సమర్పించుకోవడం. కాబట్టి, ఇస్లాం ధర్మం అంటే స్వయంగా తన ఇష్టాన్ని సర్వలోక సృష్టికర్త, ప్రభువు అయిన అల్లాహ్ కు సమర్పించుకోవడం ద్వారా పొందగలిగే ఒక శాంతియుత ధర్మం.2.   కొన్ని సందర్భాలలో శాంతిని కాపాడేందుకు బలాన్ని ఉపయోగించటం తప్పనిసరి అవుతుంది.ఈ ప్రపంచంలోని మొత్తం ప్రజలందరూ శాంతి మరియు సామరస్యాలు కొనసాగాలని కోరుకోరు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని చిన్నాభిన్నం చేయాలని అనేక మంది ప్రయత్నిస్తుంటారు. కాబట్టి కొన్ని సందర్భాలలో శాంతి సామరస్యాలను కొనసాగించేందుకు బలాన్ని ఉపయోగించవలసి వస్తుంది. ఖచ్ఛితంగా ఈ కారణం వలననే మన వద్ద పోలీసు వ్యవస్థ స్థాపించబడింది. వారు క్రిమినల్స్ మరియు సంఘ విద్రోహులను తమ బలంతో అణిచి వేసి, దేశంలో శాంతిని పునరుద్ధరిస్తారు. ఇస్లాం ధర్మం శాంతిని సమర్ధిస్తుంది. అలాగే, హింస, అన్యాయం, అక్రమం, అరాచకం మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడి, అక్కడ శాంతిని, న్యాయాన్ని స్థాపించమని తన సహచరులను ప్రోత్సహిస్తుంది. ఒక్కోసారి ఇలాంటి సందర్భాలలో బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. కేవలం శాంతి మరియు న్యాయ స్థాపనలో మాత్రమే బలాన్ని ఉపయోగించవచ్చని ఇస్లాం ధర్మం అనుమతి ఇస్తున్నది. 3.   సుప్రసిద్ధ చరిత్రకారుడు డి లేసీ ఓలియరీ (De Lacy O’Leary) అభిప్రాయం.ఇస్లాం ధర్మం ఖడ్గం ద్వారా వ్యాపించింది అనే అపార్థానికి ఉత్తమ జవాబు సుప్రసిద్ధ చరిత్రకారుడు డి లేసీ ఓలియరీ, తన పుస్తకం "Islam at the cross road (ఇస్లాం ఎట్ ద క్రాస్ రోడ్)" (Page 8) లో ఇచ్చినాడు:"తీవ్రవాద ముస్లింలు ప్రపంచ దేశాలను జయిస్తూ, తాము ఆక్రమించుకున్న ప్రజలను బలవంతంగా ఇస్లాం ధర్మం స్వీకరించేలా చేసారనేది చరిత్రకారులు చరిత్రలో ఎన్నడూ ఏ విషయంలోనూ మాటిమాటికీ రిపీట్ చేయని అత్యంత అర్థ రహితమైన మరియు న్యాయవిరుద్ధమైన విచిత్ర విషయం."4.   స్పెయిన్ దేశాన్ని ముస్లింలు 800 సంవత్సరాలు పరిపాలించారు.ముస్లింలు స్పెయిన్ దేశాన్ని దాదాపు 800 ఏళ్ళు పరిపాలించారు. స్పెయిన్ ప్రజలు తమ ధర్మాన్ని వదిలి, ఇస్లాం ధర్మాన్ని బలవంతంగా స్వీకరించేలా ముస్లింలు ఎన్నడూ ఖడ్గాన్ని ఉపయోగించలేదు. అయితే, తర్వాత కాలంలో అక్కడ క్రైస్తవ క్రూసేడర్లు వచ్చారు మరియు ముస్లింల ఉనికి లేకుండా చేసారు. ఆ కాలంలో బహిరంగంగా అదాన్ పిలుపు (నమాజు కోసం పిలిచే పిలుపు) ఇవ్వగలిగే ఒక్క ముస్లిం కూడా లేకపోయాడు. 5.  14 మిలియన్ల అరబ్బులు కోప్టిక్ క్రైస్తవులు.అరేబియా ద్వీపకల్పం 1400 ఏళ్ళ నుండి ముస్లింల పరిపాలనలో ఉంది. అక్కడి కొంత భాగాన్ని మాత్రమే కొన్నేళ్ళు పాటు బ్రిటీష్ మరియు ఫ్రెంచ్ ప్రభుత్వాలు పరిపాలించాయి. మొత్తం మీద అరేబియా ప్రాంతాన్ని ముస్లింలు 1400 ఏళ్ళ నుండి పరిపాలిస్తున్నారు. అయినా ఈనాటికీ అక్కడ దాదాపు 14 మిలియన్ల మంది కోప్టిక్ క్రైస్తవులు తరతరాల నుండి జీవిస్తున్నారు. ఒకవేళ ముస్లింలే గనుక ఖడ్గాన్ని ఉపయోగించి ఉన్నట్లయితే, అక్కడ ఈనాడు తన క్రైస్తవ ధర్మంలో కొనసాగుతున్న ఒక్క కోప్టిక్ క్రైస్తవ అరబ్బు కూడా మిగిలి ఉండేవాడు కాదు. 6.   భారతదేశంలో 80% కంటే ఎక్కువ మంది ప్రజలు ముస్లిమేతరులు.భారతదేశాన్ని ముస్లింలు దాదాపు వెయ్యి సంవత్సరాలు పరిపాలించారు. భారతదేశంలోని ప్రతి ముస్లిమేతరుడిని ఇస్లాం స్వీకరించేలా ఒత్తిడి రాగలిగేటంత బలమైన స్థితిలో ఉండటం వలన ఒకవేళ వారలా చేయదలుచుకుంటే, దాని నుండి వారి నెవరూ ఆపలేక పోయేవారు. ఈనాడు భారతదేశంలో 80% కంటే ఎక్కువ మంది ముస్లిమేతరులు నివసిస్తున్నారు. ఇస్లాం ధర్మం ఖడ్గం ద్వారా వ్యాపించలేదనడానికి ఈనాడు ఈ భారతీయ ముస్లిమేతరులందరూ సాక్ష్యంగా ఉన్నారు. 7.  ఇండోనేషియా మరియు మలేషియా.ఇండోనేషియా ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగి ఉన్న దేశం. మలేషియా దేశంలో అత్యధిక ప్రజలు ముస్లింలే. మరి ఎవరినైనా ఈ ప్రశ్న అడగవచ్చా, "ఇండోనేషియా మరియు మలేషియా దేశాలపై ఏ ముస్లిం సైన్యం దండెత్తింది?"8. ఆఫ్రికా ఖండపు తూర్పు తీరం.అలాగే, ఆఫ్రికా ఖండపు తూర్పు తీరంలో కూడా ఇస్లాం ధర్మం చాలా వేగంగా వ్యాపించింది. ఒకవేళ ఇస్లాం ధర్మం ఖడ్గ బలం వలన వ్యాపించింది అనుకుంటే, ఎవరైనా ఈ ప్రశ్న అడగవచ్చు కదా, "ఆఫ్రికా ఖండపు తూర్పు తీరంపై ఏ ముస్లిం సైన్యం దండెత్తింది?"9. థామస్ కార్లయిల్ (Thomas Carlyle).సుప్రసిద్ధ చరిత్రకారడు థామస్ కార్లయిల్  తన పుస్తకం "Heroes and Hero worship హీరోస్ అండ్ హీరో వర్షిప్", లో ఇస్లాం ధర్మం ఖడ్గబలం ద్వారా వ్యాపించింది అనే అపార్థాన్ని ఖండిస్తూ ఇలా వ్రాసినాడు: "అవును ఖచ్ఛితంగా ఖడ్గమే, కానీ మీ ఖడ్గాన్ని ఎక్కడ నుండి పొందుతారు? ప్రతి నూతన ఆలోచన ఆరంభంలో ఖచ్ఛితంగా మైనారిటీ దశలోనే ప్రారంభమవుతుంది – కేవలం ఎవరో ఒక వ్యక్తి మెదడులో మాత్రమే ప్రారంభమవుతుంది. ఒక్కడి మెదడులోనే అయినా అది అక్కడ నిలదొక్కుకుంటుంది. మొత్తం ప్రపంచంలో కేవలం ఒకే ఒక్కడు దానిని విశ్వసిస్తాడు, మొత్తం ప్రపంచ ప్రజలందరికి వ్యతిరేకంగా ఒకే ఒక్కడు నిలబడి ఉంటాడు. ఆ స్థితిలో అతడు ఖడ్గాన్ని తీసుకుని బలవంతంగా తన ఆలోచనను ఇతర ప్రజలలో వ్యాపింప జేయాలని చూస్తే, అది అతడికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. తప్పకుండా నీవు (ప్రచార) కత్తిని తీసుకోవాలి! ఆ తర్వాత అది స్వయంగా తనకు తోచిన విధంగా వ్యాపిస్తూ పోతుంది."10. ధర్మంలో ఎలాంటి బలవంతం ఉండరాదు.ఏ ఖడ్గబలంతో ఇస్లాం ధర్మం వ్యాపించింది? ముస్లింల చేతిలో పదునైన ఖడ్గం ఉన్నా దానిని వారు ఇస్లాం ధర్మ వ్యాప్తి కోసం వాడలేరు ఎందుకంటే క్రింది ఖుర్ఆన్ వచనం వారిని ఇలా ఆదేశిస్తున్నది: "ధర్మంలో ఎలాంటి బలవంతం ఉండరాదు: అసత్యం నుండి సత్యం చాలా స్పష్టంగా నిలదొక్కుకుంటుంది" [ఖుర్ఆన్ 2:256]11. తెలివిగలవారి ఖడ్గం.ఇది తెలివిగలవారి ఖడ్గం. ప్రజల హృదయాలను మరియు మనస్సులను జయించే ఖడ్గం ఇది. ఖుర్ఆన్ లోని 16వ అధ్యాయమైన సూరతున్నహల్ లోని 125వ వచనం ఇలా ప్రకటిస్తున్నది:"వివేకం మరియు ఉత్తమ సందేశం ద్వారా ప్రభువు వైపునకు ఆహ్వానించండి. ఇంకా అత్యుత్తమమైన మరియు అత్యంత ఉదారమైన రీతిలో వారితో వాదించండి." ఖుర్ఆన్ 16:12512. 1934 నుండి ప్రపంచ ధర్మాలలో అభివృద్ధి చెందున్న ధర్మం.1986వ సంవత్సరపు రీడర్స్ డైజెష్ట్ అల్ మనాక్ (‘Almanac’) లో 1934 నుండి 1984 వరకు గడిచిన అర్థ శతాబ్ద కాలంలో ప్రపంచంలో అభివృద్ధి చెందిన ప్రధాన ధర్మాల గణాంక వివరాల గురించి ఒక వ్యాసం ప్రచురించబడింది. ఇదే వ్యాసం ది ప్లెయిన్ ట్రూథ్ (‘The Plain Truth’) అనే మ్యాగజైనులో కూడా ప్రచురితమైంది. వాటన్నింటిలో ఇస్లాం ధర్మం 235% అభివృద్ధి శాతంతో మొట్ట మొదటి స్థానంలో ఉన్నది. దాని తర్వాత 47% అభివృద్ధి శాతంతో క్రైస్తవ ధర్మం రెండో స్థానంలో ఉంది. మరి, ఈ శతాబ్దంలో ఇస్లాం ధర్మ వ్యాప్తి కొరకు ఏ యుద్ధం జరిగింది మరియు ఇన్ని మిలియన్ల ప్రజలను ముస్లింలుగా మార్చిందని ఎవరైనా ప్రశ్నించవచ్చు కదా?13. అమెరికా మరియు యూరోపులలో అన్నిధర్మాల కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ధర్మం ఇస్లాం ధర్మం. ఈనాడు అమెరికాలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ధర్మం ఇస్లాం ధర్మం. అలాగే యూరోపులో కూడా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ధర్మం ఇస్లాం ధర్మమే. మరి, ఈ పాశ్చాత్య దేశాలలో ఏ ఖడ్గం ప్రజలను అంత ఎక్కువ సంఖ్యలో ఇస్లాం ధర్మం స్వీకరించేలా బలవంత పెడుతున్నది?14.   డాక్టర్ జోసెఫ్ ఆదమ్ పీర్సన్ (Dr. Joseph Adam Pearson).డాక్టర్ జోసెఫ్ ఆదమ్ పీర్సన్ ఈ నిజమైన పలుకులు పలికారు, "ఏదో ఒకరోజు న్యూక్లియర్ ఆయుధాలు అరబ్బుల చేతికి చిక్కుతాయని భయపడుతున్న ప్రజలు, ఇప్పటికే ఇస్లామీయ బాంబు పేల్చి వేయబడిందనే యదార్థాన్ని గ్రహించ లేక పోతున్నారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టిన రోజునే అది పేల్చబడింది". ఎందుకు అనేకమంది ముస్లింలు ఫండమెంటలిష్టులుగా మరియు ఉగ్రవాదులుగా పేర్కొనబడు తున్నారు?ధార్మిక లేదా ప్రాపంచిక వ్యవహారాలపై జరిగే ప్రతి చర్చలో మామూలుగా ఈ ప్రశ్న ముస్లింలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎక్కు పెట్టబడుతుంది. అన్ని రకాల మీడియాలలో ముస్లింలకు మరియు ఇస్లాం ధర్మానికి సంబంధించిన సమాచారంలో అనేక అపార్థాలు స్థిరంగా పాతుకు పోయాయి. వాస్తవానికి, అలాంటి అపార్థాలు మరియు తప్పుడు ప్రచారాలు తరుచుగా ముస్లింలపై దౌర్జన్యానికి మరియు పక్షపాతానికి దారి తీస్తున్నాయి. ఉదాహరణకు, అమెరికాలోని ఓక్లహామా బాంబు ప్రేలుడు జరిగిన తర్వాత అక్కడి మీడియా ప్రవర్తన గురించి తీసుకుందాము – బాంబు ప్రేలుడు జరిగిన వెంటనే అక్కడి మీడియా ఆ సంఘటన వెనుక మధ్యేసియా దేశాల కుట్ర (‘Middle Eastern conspiracy’) ఉన్నట్లు ప్రకటించింది. అయితే తర్వాత జరిగిన నేర పరిశోధనలలో ఆ బాంబు ప్రేలుళ్ళ వెనుక అమెరికన్ ఆర్మడ్ ఫోర్సెస్ కు చెందిన ఒక సైనికుడు ఉన్నట్లు గుర్తించబడింది.  ఇక ఇప్పుడు ఛాందసవాదం (‘fundamentalism’) మరియు ఉగ్రవాదం (‘terrorism’) గురించి చర్చించుదాం:1. ఫండమెంటలిశమ్, మౌలికవాదం (‘fundamentalist’) అనే పదం యొక్క నిర్వచనం:ఫండమెంటలిష్టు అంటే తను నమ్మిన వాదం, సిద్ధాంతం లేదా ధర్మంలోని మౌలికాంశం, మూలాధారం, ప్రాతిపదిక, మూలసిద్ధాంతం మొదలైన ప్రధానమైన మరియు ఆవశ్యకమైన అంశాలను చిత్తశుద్ధితో అనుసరించేవాడు మరియు తు.చ. తప్పక పాటించేవాడు. ఒక వ్యక్తి మంచి డాక్టరుగా మారాలంటే, తప్పకుండా వైద్యశాస్త్రంలోని మౌలికాంశాలను, మూలాధారాలను, ప్రాతిపదికలను, మూలసిద్ధాంతాలను అతడు క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అనుసరించాలి మరియు ప్రాక్టీసు చేయాలి. మరో మాటలో, అతడు వైద్యశాస్త్రంలో ఫండమెంటలిష్టుగా (fundamentalist) మారాలి. అలాగే, ఒక మంచి గణితశాస్త్రజ్ఞుడిగా మారడానికి, తప్పకుండా గణిత శాస్త్రంలోని మౌలికాంశాలను, మూలాధారాలను, ప్రాతిపదికలను, మూలసిద్ధాంతాలను అతడు క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అనుసరించాలి మరియు ప్రాక్టీసు చేయాలి. అంటే అతడు గణితశాస్త్రంలో ఫండమెంటలిష్టుగా (fundamentalist) మారాలి. అలాగే, ఒక మంచి సైంటిష్టుగా మారడానికి, అతడు తప్పకుండా వైజ్ఞానిక శాస్త్రంలోని మౌలికాంశాలను, మూలాధారాలను, ప్రాతిపదికలను, మూలసిద్ధాంతాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అనుసరించాలి మరియు ప్రాక్టీసు చేయాలి. అంటే అతడు వైజ్ఞానిక శాస్త్రంలో ఫండమెంటలిష్టుగా (fundamentalist) మారాలి. 2.   ఫండమెంటలిష్టులందరూ సమానం కాదు. ఎవరైనా ఫండమెంటలిష్టులందరినీ ఒకే బ్రష్ తో రంగు వేయలేరు. మరోమాటలో ఫండమెంటలిష్టులందరూ మంచివారని గానీ లేదా చెడువారని గానీ వర్గీకరించటం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి వర్గీకరణ వారు దృష్టి కేంద్రీకరించిన విభాగం లేదా అంశంపై ఆధారపడి ఉంటుంది. ఒక ఫండమెంటల్ దోపిడీ దొంగ లేదా బందిపోటు దొంగ సమాజానికి హాని కలిగిస్తాడు. కాబట్టి అతడిని ఎవ్వరూ ఇష్టపడరు. మరో వైపు ఒక ఫండమెంటల్ డాక్టర్, సమాజానికి మేలు కలుగజేస్తాడు. కాబట్టి అతడికి ఎంతో గౌరవం లభిస్తుంది. 3.   ఒక ముస్లిం ఫండమెంటలిష్టుగా పేర్కొనబడటం నాకెంతో గొప్పగా కనబడుతుంది. నేనొక ముస్లిం ఫండమెండలిష్టును. అల్లాహ్ దయ వలన, ఇస్లాం ధర్మం యొక్క మౌలిక, మూలాధార, మూలసైద్ధాంతిక, ప్రాతిపదిక అంశాలను నేను గ్రహించడానికి, అనుసరించడానికి మరియు ప్రాక్టీసు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. ఒక నిజమైన ముస్లిం తనొక ఫండమెంటలిష్టునని ఒప్పుకోవడానికి సిగ్గు పడడు. నేను ఒక ఫండమెంటలిష్టు ముస్లింను అని చెప్పడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే, ఇస్లామీయ ధర్మం యొక్క ఫండమెంటల్సు అంటే మూల సిద్ధాంతాలు మానవజాతికి మరియు మొత్తం ప్రపంచానికి ఎంతో ప్రయోజనాన్ని కలుగజేస్తాయి. మొత్తం మీద మానవజాతికి హాని కలిగించే లేదా మానవజాతి ప్రయోజనాలకు నష్టం కలిగించే ఒక్క మూలసిద్ధాంతం కూడా ఇస్లాం ధర్మంలో లేదు. అనేక మంది ప్రజలు ఇస్లాం ధర్మం గురించి అపార్థాలు పుట్టిస్తూ ఉంటారు మరియు అనేక ఇస్లామీయ బోధనలు అసంపూర్ణమైనవిగా మరియు అనుచితమైనవిగా పరిగణిస్తారు. దీనికి కారణం వారికి ఇస్లాం ధర్మం గురించి సరైన మరియు తగినంత జ్ఞానం లేకపోవడం. ఒకవేళ ఎవరైనా ఇస్లాం ధర్మ బోధనలను నిష్పక్షపాతంగా విమర్శనాత్మకమైన దృష్టితో పరిశీలిస్తే, వ్యక్తిగత స్థాయిలోనూ మరియు సామాజిక స్థాయిలోనూ పనికి వచ్చే మొత్తం ప్రయోజనాలన్నింటినీ ఇస్లాం ధర్మం కలిగి ఉందనే వాస్తవాన్ని ఒప్పుకోకుండా ఉండలేరు. 4.   ఫండమెంటలిష్టు (‘fundamentalist’) అనే పదం యొక్క నిఘంటు అర్థం:వెబ్ స్టర్ నిఘంటువు (Webster’s dictionary) ప్రకారం 20వ శతాబ్దపు ఆరంభంలో మొదలైన అమెరికన్ ప్రొటెష్టనిశమ్ ఉద్యమమే ఫండమెంటలిశమ్. అది ఆధునిక వాదానికి భిన్నంగా వచ్చిన ప్రతిస్పందన. దైవవిశ్వాస మరియు నైతిక అంశాలలోనే కాకుండా చారిత్రక సాహిత్య పరంగా కూడా బైబిల్ లో ఎలాంటి పొరపాట్లు లేవనీ అది నొక్కి వక్కాణించింది. కాబట్టి ఫండమెంటలిశమ్ అనేది బైబిల్ ఎలాంటి తప్పులు మరియు పొరపాట్లు లేని ఒక స్వచ్ఛమైన దైవవచనం అని విశ్వసించే క్రైస్తవ బృందాన్ని సూచించే ఒక పదంగా ఆరంభంలో వాడబడింది. ఆక్స్ ఫర్డ్ నిఘంటువు (Oxford dictionary) ప్రకారం, ఫండమెంటలిశమ్ అంటే ఏ ధర్మంలోనైనా ప్రత్యేకంగా ఇస్లాం ధర్మంలో ప్రాచీన లేక మౌలిక సిద్ధాంతాలను ఖచ్ఛితంగా కొనసాగించడం. ఈనాడు ఫండమెంటలిష్టు అనే పదం వినగానే ఎవరికైనా మీడియా దుష్ప్రచారం చేస్తున్న ఒక ముస్లిం టెర్రరిష్టు రూపం గుర్తుకు వస్తుంది. 5.   ప్రతి ముస్లిం ఒక టెర్రరిష్టుగా మారాలి ప్రతి ముస్లిం ఒక టెర్రరిష్టుగా మారాలి. టెర్రరిష్టు అంటే టెర్రర్ పుట్టించేవాడు. ఎప్పుడైతే ఒక దొంగ ఒక పోలీసు ఆఫీసరును చూస్తాడో, వెంటనే అతడిలో టెర్రర్ పుట్టుకు వస్తుంది. ఇక్కడ దొంగ కొరకు పోలీసు ఆఫీసరు ఒక టెర్రరిష్టు. అలాగే సమాజంలోని దొంగలు, దోపిడీదార్లు, రేపిష్టులు వంటి సంఘవిద్రోహశక్తుల కొరకు ప్రతి ముస్లిం ఒక టెర్రరిష్టుగా మారాలి. అలాంటి సంఘ విద్రోహశక్తులు ఒక ముస్లింను చూడగానే, వారిలో టెర్రర్ పుట్టుకు రావాలి. మామూలుగా టెర్రరిష్టు పదం సామాన్య ప్రజలలో టెర్రర్ పుట్టించే వ్యక్తిని సూచించే విధంగా వాడబడుతుండటం నిజమైన విషయమే. అయితే ఒక నిజమైన ముస్లిం కేవలం సంఘ విద్రోహ శక్తుల కొరకు మాత్రమే టెర్రరిష్టుగా మారతాడు గానీ అమాయక ప్రజల కొరకు ఎంతమాత్రం కాదు. వాస్తవానికి అమాయక ప్రజల కొరకు అతడు శాంతి, సామరస్యాల మూలంగా మారాలి. 6.  ఎవరైనా చేసిన ఒకే పనికి పరస్పర విరుద్ధమైన పేర్లు పెట్టడం అంటే టెర్రరిష్టనీ మరియు దేశభక్తుడనీ (‘patriot’).బ్రిటీష్ పరిపాలన నుండి స్వాతంత్ర్యం పొందక ముందు, అహింసా సిద్ధాంతాన్ని నమ్మని కొందరు భారతీయ స్వాతంత్ర్య యోద్ధులను బ్రిటీష్ ప్రభుత్వం టెర్రరిష్టులుగా ప్రకటించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారే దేశభక్తులుగా కొనియాడబడినారు. అంటే ఆ ప్రజలకే, వారు చేసిన ఒకే పనికి రెండు విభిన్నమైన పేర్లు ఇవ్వబడినాయి. ఒకరు వారిని టెర్రరిష్టులని ఆరోపిస్తే, మరొకరు వారిని దేశభక్తులని కొనియాడారు. భారత దేశాన్ని పరిపాలించే హక్కు బ్రిటీష్ సామ్రాజ్యానికి ఉందని నమ్మే ప్రజలు వారిని టెర్రరిష్టులని అన్నారు. మరి, భారత దేశాన్ని పరిపాలించే హక్కు బ్రిటీష్ సామ్రాజ్యానికి లేదని నమ్మే ప్రజలు వారిని దేశభక్తులని, స్వాతంత్ర్య సమర యోద్ధులనీ పిలిచారు. కాబట్టి ఎవరైనా వ్యక్తి గురించి తీర్పు ఇచ్చే ముందు, అతడికి తన వాదనను వినిపించే పూర్తి అవకాశాన్ని ఇవ్వాలి. ఇరువైపుల వాదనలు వినాలి, విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి మరియు వ్యక్తి యొక్క తర్కం మరియు ఉద్దేశ్యాన్ని పరిగణలోనికి తీసుకోవాలి, చివరిగా ఆ వ్యక్తి గురించి తీర్పు చెప్పాలి. 7.   ఇస్లాం అంటే శాంతి, సమర్పణఇస్లాం అనే అరబీ పదానికి మూలం సలామ్ అనే పదం. దీని అర్థం శాంతి మరియు సమర్పణ. ఇదొక శాంతియుత ధర్మం. ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపించాలని మరియు శాంతిని ప్రోత్సహించాలని దీని మూలసిద్ధాంతాలు తన సహచరులను బోధిస్తున్నాయి.కాబట్టి ప్రతి ముస్లిం ఒక ఫండమెంటలిష్టుగా మారాలి అంటే అతడు శాంతియుత ధర్మమైన ఇస్లాం బోధనలను అతడు అనుసరించాలి: సమాజంలో శాంతిని మరియు న్యాయాన్ని స్థాపించడం కోసం అతడు సంఘ విద్రోహశక్తుల పాలిట ఒక టెర్రరిష్టుగా మారాలి. ఎందుకు ముస్లిమేతరులను కాఫిర్లని పిలుస్తూ ముస్లింలు వారిని దూషిస్తున్నారు?‘కాఫిర్’ అంటే తిరస్కరించేవాడు అని అర్థం. ‘కాఫిర్’ అనే పదం కుఫ్ర్ అనే పదం నుండి గ్రహించబడింది. దీని అర్థం దాచటం లేదా తిరస్కరించడం. ఇస్లామీయ పరిభాష ప్రకారం, కాఫిర్ అంటే ఇస్లాం ధర్మం యొక్క సత్యాన్ని దాచే లేదా తిరస్కరించే వ్యక్తి. ఇంగ్లీషులో ఇస్లాం ధర్మాన్ని తిరస్కరించే వ్యక్తిని నాన్ ముస్లిం అని పిలుస్తారు.ఒకవేళ ముస్లిమేతరులకు బాధ కలిగితే, వారు వెంటనే ఇస్లాం స్వీకరించాలి.ఒకవేళ ఎవరైనా ముస్లిమేతరుడికి కాఫిర్ లేదా ముస్లిమేతరుడు అనే పదం దూషణగా అనిపిస్తే, అతడు ఇస్లాం ధర్మం స్వీకరించడాన్ని ఎంచుకోవాలి. అప్పుడు మేము అతడిని కాఫిర్ లేదా ముస్లిమేతరుడు అని పిలవటం ఆపివేస్తాము.

المرفقات

2

ఇస్లాం ధర్మంపై కొన్ని ప్రశ్నోత్తరాలు
ఇస్లాం ధర్మంపై కొన్ని ప్రశ్నోత్తరాలు