البحث

عبارات مقترحة:

الله

أسماء الله الحسنى وصفاته أصل الإيمان، وهي نوع من أنواع التوحيد...

الرفيق

كلمة (الرفيق) في اللغة صيغة مبالغة على وزن (فعيل) من الرفق، وهو...

القابض

كلمة (القابض) في اللغة اسم فاعل من القَبْض، وهو أخذ الشيء، وهو ضد...

ఇస్లాం మరియు ముస్లింలపై కొన్ని ప్రశ్నోత్తరాలు

التلجوية - తెలుగు

المؤلف ముహమ్మద్ కరీముల్లాహ్ ، షేఖ్ నజీర్ అహ్మద్
القسم كتب وأبحاث
النوع نصي
اللغة التلجوية - తెలుగు
المفردات الدعوة إلى الله - دعوة غير المسلمين - الدعوة إلى الإسلام - شبهات حول الإسلام - تعريف الإسلام
ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేయుకోవటానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

التفاصيل

ఇస్లాం మరియు ముస్లింలపై  కొన్ని ప్రశ్నోత్తరాలు             ఇస్లాం మరియు ముస్లింలపై కొన్ని ప్రశ్నోత్తరాలు ఇస్లాం ధర్మం అంటే ఏమి? ముస్లింలు అంటే ఎవరు ? ఎవరైనా ముస్లింగా మారాలంటే ఏమి చేయాలి ? ‘ఇస్లాం’ అంటే అర్థం ఏమిటి ? అల్లాహ్ అంటే ఎవరు ? తరచుగా ఇస్లాం ధర్మం అపరిచిత ధర్మంగా ఎందుకు కనబడుతుంది ? ఇస్లాం వ్యాప్తి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసింది ? కాబహ్ అంటే ఏమిటి ? ఇస్లాం ధర్మమే సత్యమైనదని మనమెలా తెలుసుకోగలం ? ఇస్లాం ధర్మాన్ని ముహమ్మదీయ మతమని పిలవడం సరైనదేనా ? ముస్లింలను ముహమ్మదీయులు అని పిలవడం సరైనదేనా ? ముస్లింలందరూ అరబ్బులు మరియు అరబ్బులందరూ ముస్లింలు – ఇది కరక్టేనా ? ఇస్లాం ధర్మాన్ని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థాపించారని అనడం కరక్టేనా ? ముస్లింలు వేర్వేరు గ్రూపులుగా, వర్గాలుగా ఎందుకు విడిపోయారు ? సహజంగా మతాలన్నీ మంచి పనులు చేయమనే తమ తమ అనుచరులను ఆదేశిస్తాయి. మరి అలాంటప్పుడు ఎవరైనా ఇస్లాంనే ఎందుకు అనుసరించాలి ? ఇతర ధర్మాల్ని అనుసరించకూడదా ? ఒకవేళ ఇస్లాం ధర్మం అత్యుత్తమ మైనదే అయితే, మరి అనేకమంది ముస్లింలు నమ్మదగనివారుగా, నిజాయితీ లేనివారుగా ఎందుకు పేర్కొనబడుతున్నారు మరియు మోసం, దగా, వంచన, లంచాలు ఇచ్చిపుచ్చుకోవడం, మత్తుపదార్థాల వ్యాపారం చేయడం మొదలైన వాటిలో ఎందుకు మునిగి ఉన్నారు ?  ఇస్లాం మరియు ముస్లింలపై  కొన్ని ప్రశ్నోత్తరాలు            www.islamhouse.com ఇస్లాం మరియు ముస్లింలపై కొన్ని ప్రశ్నోత్తరాలు ఇస్లాం ధర్మం అంటే ఏమి?ఇస్లాం ధర్మం అనేది ఒక నూతన ధర్మం ఎంతమాత్రమూ కాదు. ఆరంభం నుండి తన ప్రవక్తలందరి ద్వారా ప్రతి ఒక్క సమాజానికి సర్వలోక సృష్టికర్త పంపిన అదే సత్యవాణి చిట్టచివరిగా మొత్తం మానవజాతి కొరకు ఈ అంతిమ రూపంలో పంపబడింది. ఇస్లాం ధర్మం ప్రపంచ జనాభాలోని ఐదవ వంతు ప్రజలు స్వంత ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడే ధర్మమూ మరియు సంపూర్ణ జీవన విధానమూను. శాంతి, దయ మరియు క్షమాగుణాల్ని ప్రోత్సహించే ఉత్తమ ధర్మమే ముస్లింల ఈ ధర్మం. అయితే, ఇస్లాం ధర్మంతో సంబంధం ఉందని తరచుగా ఆరోపించబడుతున్న తీవ్రవాద సంఘటనలతో ముస్లిం సమాజంలోని అత్యధిక ప్రజలకు ఎలాంటి సంబంధమూ లేదు. ముస్లింలు అంటే ఎవరు ?ప్రపంచ వ్యాప్తంగా దక్షిణ ఫిలిఫ్ఫీన్స్ నుండి నైజీరియా వరకు కేవలం వారి కామన్ ఇస్లామీయ విశ్వాసంపై ఏకమైన వివిధ జాతులకు, దేశాలకు, వర్ణాలకు, సాంప్రదాయాలకు చెందిన ఒక బిలియన్ కంటే ఎక్కువ ప్రజలు. దాదాపు 18% అరబ్బు ప్రాంతంలో నివశిస్తున్నారు; మొత్తం ప్రపంచంలో అత్యధిక ముస్లింలున్న దేశం ఇండోనేషియా; ఆసియా మరియు ఆఫ్రికాలలో ఎక్కువ భూభాగంలో ముస్లింలు ఉన్నారు, సోవియట్ యూనియన్ దేశాలలో, చైనా, ఉత్తర – దక్షిణ అమెరికా మరియు యూరోపు దేశాలలో వారి మైనారిటీ ఉనికి ప్రభావపూరితంగా ఉన్నది. ఎవరైనా ముస్లింగా మారాలంటే ఏమి చేయాలి ?చాలా సులభంగా ‘అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడెవరూ లేరు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త’ అని మనస్ఫూర్తిగా సాక్ష్యం పలకడం ద్వారా ఇస్లాం ధర్మంలోనికి ప్రవేశించవచ్చు. ఈ డిక్లరేషన్ ద్వారా ఒక విశ్వాసి అల్లాహ్ యొక్క ప్రవక్తలందరిపై మరియు వారిపై అవతరించబడిన దివ్యవాణులపై తన విశ్వాసాన్ని ప్రకటించినవాడవుతాడు. ‘ఇస్లాం’ అంటే అర్థం ఏమిటి ?'ఇస్లాం' అనేది అరబీ భాషకు చెందిన పదం. తెలుగులో దీని అర్థం 'సమర్పణ', మరియు అరబీ భాషలో 'శాంతి' అనే అర్థాన్నిచ్చే పదం నుండి ఇది గ్రహించబడింది. ధార్మికంగా, ఇస్లాం అంటే అల్లాహ్ యొక్క అభీష్టానికి పూర్తిగా సమర్పించుకోవడం. 'ముహమ్మదీయ మతం' అనేది కొన్ని చోట్ల వాడుకలో ఉన్న ఒక తప్పుడు పదం. ఎందుకంటే ముస్లింలు అల్లాహ్ ను కాకుండా ముహమ్మద్ ను ఆరాధిస్తారనే అర్థాన్ని ఆ పదం సూచిస్తున్నది. అల్లాహ్ అంటే ఎవరు ?'అల్లాహ్' అనేది అరబీ భాషలో ముస్లింలు మరియు అరబ్బు క్రైస్తవులు పిలిచే దేవుడి పేరు. అల్లాహ్ అనే పదం దేవుడి ఏకదైవత్వాన్ని, అద్వితీయతను సూచించినంత స్పష్టంగా, సూటీగా ఏ పదమూ సూచించలేదు – ఎందుకంటే అల్లాహ్ అనే పదానికి అస్సలు బహువచనమూ, స్త్రీలింగ పదమూ లేవు. ఉదా, తెలుగులో దేవుడు అనే పదానికి దేవుళ్ళు అనే బహువచన పదం, దేవత అనే స్త్రీలింగపదం ఉన్నాయి, అలాగే ఇంగ్లీష్టులో గాడ్స్ మరియు గాడ్డెస్ అనే బహువచన, స్త్రీలింగ పదాలు ఉన్నాయి. అల్లాహ్ అనే పదానికి భాషాపరంగా కూడా బహువచన పదం గానీ, స్త్రీలింగ పదం గానీ లేకుండా భాషాపరంగా కూడా ఆ సర్వలోకాల సృష్టికర్త యొక్క ఏకత్వాన్ని, అద్వితీయత్వాన్నీ ప్రకటిస్తున్నది. తరచుగా ఇస్లాం ధర్మం అపరిచిత ధర్మంగా ఎందుకు కనబడుతుంది ?ఆధునిక ప్రపంచంలో ఇస్లాం ధర్మం అసామాన్య ధర్మంగా లేదా తీవ్రవాద ధర్మంగా కనబడవచ్చు. ఎందుకంటే బహుశా ఈనాడు పాశ్చాత్య దేశాలలోని ప్రజల అనుదిన జీవితాన్ని ధర్మం శాసించక పోవడం మరియు ముస్లింలు లౌకిక, ప్రాపంచిక, మతరహిత జీవితానికీ మరియు ధార్మిక, దైవసంబంధిత, పావన జీవితాల మధ్య విభజన చూపకుండా తమ జీవితంలో ధర్మమునకే అత్యంత ఉన్నత స్థానం ఇవ్వడం కావచ్చేమో. అంతిమ దైవశాసనమైన షరిఅహ్ ను గంభీరంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా విశ్వసించడం వలన వారి జీవితంలో ధర్మానికి సంబంధించిన అంశాలు ఇప్పటికీ ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఇస్లాం వ్యాప్తి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసింది ?శీఘ్రంగా మరియు శాంతియుతంగా ఇస్లాం ధర్మం వ్యాపించడానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే దాని మూలసిద్ధాంత నిష్కాపట్యం, నిరాడంబరత, సాధరణత్వం, సరళత, స్పష్టత – అది ఆరాధింపబడే అర్హత గల ఏకైక దైవాన్ని మాత్రమే విశ్వసించమనే ఇస్లాం పిలుపు. ఇంకా తనకు ప్రసాదించబడిన బుద్ధిని సరిగ్గా ఉపయోగించి, సత్యాన్వేషణ చేయమని అది మాటిమాటికీ మానవుడిని ఆదేశించడం. కొన్నేళ్ళ లోపలే ‘ప్రతి ముస్లిం పురుషుడిపై మరియు స్త్రీపై జ్ఞానం సంపాదించడం తప్పనిసరి విధి అయి ఉన్నది’ అనే ప్రవక్త ముహ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాన్ని అనుసరించి గొప్ప గొప్ప నాగరికతలు మరియు విశ్వవిద్యాలయాలు వర్ధిల్లాయి. తూర్పు – పడమర ఆలోచనల సంయోగం, పాతవాటిలో నుండి పుట్టుకొచ్చిన క్రొత్త ఆలోచనలు వైద్య శాస్త్రంలో, గణితశాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో, భూగోళ శాస్త్రంలో, భవన నిర్మాణ శాస్త్రంలో, కళలలో, సాహిత్యంలో మరియు చరిత్రలో ఘనమైన అభివృద్ధిని తీసుకు వచ్చాయి. అల్జిబ్రా, అరబిక్ సంఖ్యలు మరియు గణితశాస్త్రం ముందుకు దూసువెళ్ళడానికి ముఖ్యకారణమైన సున్న యొక్క భావన (the concept of the zero) వంటి అనేక క్లిష్టమైన సిద్ధాంతాలు ముస్లిం నుండి మధ్యయుగ యూరోపు ప్రాంతానికి చేరుకున్నాయి. వాటి సహాయంతో యూరోపు ఖండవాసుల డిస్కవరీ సముద్రయానములు సాధ్యపడేలా చేసిన అష్ట్రోలోబ్ (astrolabe),  వృత్త చతుర్భాగం (quadrant) మరియు మంచి నౌకాయాన పటాలు మొదలైన అధునాతన పరికరాలు తయారు చేయబడినాయి. కాబహ్ అంటే ఏమిటి ?దాదాపు నాలుగు మిలియన్ల సంవత్సరాలకు పూర్వం అల్లాహ్ ఆదేశాలను అనుసరించి ప్రవక్త అబ్రహాం మరియు ప్రవక్త ఇస్మాయీల్ (అలైహిస్సలాం) లు పునః నిర్మించిన అల్లాహ్ యొక్క పవిత్ర ఆరాధనాలయమే కాబాగృహం. ఆదిమానవుడు ప్రవక్త ఆదం (అలైహిస్సలాం) కట్టిన పవిత్రస్థలంపైనే ఆ రాతి నిర్మాణం నిర్మించబడిందని చాలా మంది విశ్వసిస్తారు. ఆ పవిత్ర కాబాగృహ సందర్శనకు తరలి రమ్మని ప్రజలను ఆహ్వానించ వలసిందిగా అల్లాహ్ ప్రవక్త అబ్రహాం (అలైహిస్సలాం) ను ఆజ్ఞాపించినాడు. ఈనాటికీ ప్రజలు అక్కడికి చేరుకోగానే, లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అంటే హాజరయ్యాము ఓ ప్రభూ, హాజరయ్యాము అని బిగ్గరగా గొంతెత్తి పలుకుతూ, ప్రవక్త అబ్రహాం (అలైహిస్సలాం) పిలుపుకు బదులుగా అక్కడ హాజరవుతున్నారు. ఇస్లాం ధర్మమే సత్యమైనదని మనమెలా తెలుసుకోగలం ?అల్లాహ్ అంటే దైవం ఏకైకుడు, అద్వితీయుడు, అసమానుడు, అపూర్వుడు మరియు పరమ సంపూర్ణుడు అని ప్రకటిస్తున్న ధర్మం కేవలం ఇదొక్కటే. జీసస్ లేదా విగ్రహాలు లేదా దైవదూతల ఆరాధనను అణువంత కూడా విశ్వసించకుండా కేవలం మరియు కేవలం అల్లాహ్ యొక్క ఆరాధనను మాత్రమే విశ్వసించే ధర్మం ఇదొక్కటే. ఖుర్ఆన్ లో ఎలాంటి పరస్పర వైరుధ్యాలూ, వ్యత్యాసాలూ, అసంగతులూ, అసంబద్ధములూ లేవు. వారి కాలం కంటే 13 శతాబ్దాలకు ముందరగానే తెలుపబడిన వైజ్ఞానిక వాస్తవాలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. 1400 సంవత్సరాలకు పూర్వం అవతరించిన ఖుర్ఆన్ గ్రంథంలో ఉన్న అనేక వైజ్ఞానిక వాస్తవాలను ఈమధ్యనే శాస్త్రజ్ఞులు కనిపెట్ట గలిగారు. ఖుర్ఆన్ ఎక్కడా సైన్సుతో విభేదించడం లేదు.  ఖుర్ఆన్ వంటి గ్రంథాన్ని తయారు చేయమని అల్లాహ్ సవాలు చేసినాడు. మరియు అలా ఎవ్వరూ తయారు చేయలేరని ఆయన స్పష్టంగా ప్రకటించాడు కూడా. చరిత్రలో అత్యంత ప్రబలమైన పలుకుబడిగల మానవుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మైకెల్ హెచ్. హార్ట్ అనే ఒక ముస్లిమేతరుడి "The 100 most influential men in History" పుస్తకంలో, మొట్టమొదటి స్థానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడింది మరియు మూడవ స్థానం ప్రవక్త జీసస్ అలైహిస్సలాంకు ఇవ్వబడింది. ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏమిటంటే జీసస్ (అలైహిస్సలాం) కూడా అల్లాహ్ పంపిన ప్రవక్తే. మరి ఏ అసత్య ప్రవక్తనైనా దైవం అంత ఎక్కువ సాఫల్యవంతుడిని ఎలా చేస్తాడు? ముమ్మాటికీ కాదు. ఇదే విషయం బైబిల్ లోని ద్వితీయోపదేశకాండం 18:19 లో కూడా పేర్కొనబడింది. అసత్య ప్రవక్త చనిపోతాడు! కానీ అల్లాహ్ యొక్క ధర్మాన్ని పూర్తిగా అందజేయకుండా మరియు బోధించకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోలేదు కదా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక భవిష్యవాణులు ప్రవచించారు. వాటిలో అనేకం ఇప్పటికే నిజంగా సంభవించాయి మరియు మరికొన్ని నిజం కాబోతున్నాయి. ఇస్లాం ధర్మాన్ని ముహమ్మదీయ మతమని పిలవడం సరైనదేనా ?లేదు, ఇస్లాం ధర్మాన్ని ముహమ్మదీయ మతం అని పిలవడం తప్పు. దీనిని ఇస్లాం ధర్మం అని మాత్రమే పిలవాలి. ముస్లింలను ముహమ్మదీయులు అని పిలవడం సరైనదేనా ?ఇస్లాం ధర్మావలంబీకుడిని (భాషాపరంగా ఇస్లాం అంటే “సమర్పణ”) ముస్లిం అని మాత్రమే పిలవాలి (భాషాపరంగా ముస్లిం అంటే “సమర్పించుకున్నవాడు” లేదా “ఒప్పగించుకున్నవాడు”).  ముస్లింలు కేవలం ఏకైకుడు, అద్వితీయుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తారు. ముస్లింలు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అస్సలు ఆరాధించరు. ఇస్లాం ధర్మ స్థాపకుడు అల్లాహ్ యే గానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత మాత్రమూ కాదు. అంతేగాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవికమైన లేక దివ్యమైనవారు కాదు, దైవికం లేదా దివ్యత్వం కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందును. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిత్యులు, అమరులు, శాశ్వతంగా ఉండేవారు కాదు, కేవలం అల్లాహ్ మాత్రమే నిత్యుడు, అమరుడు, శాశ్వతమైనవాడూను. ఎవరైతే మనస్ఫూర్తిగా, శాంతియుతంగా తమకు తాము అల్లాహ్ కు సమర్పించుకుంటారో, ఒప్పగించుకుంటారో, అలాంటివారే ముస్లింలు. అనుదినం వారు తమ అధీనత, విశ్వాసం, ప్రభుభక్తినీ ఖరారు చేస్తూ అల్లాహ్ కు వాగ్దానం చేస్తారు. ముస్లింలందరూ అరబ్బులు మరియు అరబ్బులందరూ ముస్లింలు – ఇది కరక్టేనా ?కాదు, ముమ్మాటికీ కాదు. అరబీ భాష చదవగలిగే, వ్రాయగలిగే మరియు మాట్లాడగలిగే ఏ వ్యక్తి అయినా అరబ్బు అని పిలవబడతాడు. ప్రపంచంలో దాదాపు 1.6 బిలియన్ల ముస్లింలు ఉన్నారు. అందులో కేవలం 20% మాత్రమే అరబ్బులు ఉండగా, మిగిలిన వారందరూ అరబ్బేతరులే.అరబ్బు ప్రజలలో దాదాపు 8% క్రైస్తవులు, యూదులు, అస్సిరియన్లు, నాస్తికులు,  దేవుడు ఉన్నదీ లేనిదీ చెప్పడం సాధ్యం కాదని భావించే అజ్ఞతావాదులు మొదలైన ముస్లిమేతరులు ఉన్నారు. ఏదేమైనా ప్రతి ముస్లిం కొరకు అరబీ భాష అభ్యసించడం మరియు నేర్చుకోవడం చాలా ముఖ్యం. తద్వారా అతను/ఆమె ప్రతిరోజూ ఐదు పూటలా నమాజు చేయగలుగుతారు, ఖుర్ఆన్ చదవగలుగుతారు మరియు దానిని అర్థం చేసుకోగలుగుతారు. ఇస్లాం ధర్మాన్ని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థాపించారని అనడం కరక్టేనా ?కాదు, ముమ్మాటికీ కానే కాదు. ఇస్లాం ధర్మ స్థాపకుడు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ అని ముస్లింలు విశ్వసిస్తారు. భాషాపరంగా ఇస్లాం అంటే ‘సమర్పించుకోవడం’: కాబట్టి ఇస్లాం అనేది అల్లాహ్ కు విధేయతా పూర్వకంగా సమర్పించుకునే ధర్మం. అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకోవడమనే దివ్యసందేశాన్నే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు పూర్వం వచ్చిన జీసస్, మోసెస్ మరియు ఇతర ప్రవక్తలు (అలైహిస్సలాం)లు కూడా బోధించారు. ముస్లింలు వేర్వేరు గ్రూపులుగా, వర్గాలుగా ఎందుకు విడిపోయారు ?1. ముస్లింలు ఒక్కటి కావాలి, ఐక్యమవాలి:ఈనాడు ముస్లింలు తమలో తాము విభజింపబడి, వేర్వేరు వర్గాలలో చీలిపోయి ఉన్నారనేది ఒక వాస్తవం. ఒక ట్రాజెడీ ఏమిటంటే అలాంటి విభజనలను ఇస్లాం ధర్మం అస్సలు సమ్మతించదు, ఆమోదించదు. తన అనుచరులలో ఐకమత్యం వృద్ధి చెందుతుందని ఇస్లాం ధర్మం విశ్వసిస్తుంది. ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది:"గట్టిగా పట్టుకోండి,అందరూ కలిసి కట్టుగా,                                                                                                         (మీ కోసం పంపబడిన)అల్లాహ్ యొక్క త్రాడును, మరియు మీలో మీరు వేరుపడిపోవద్దు;"                [ఖుర్ఆన్ 3:103]ఈ వచనంలో పేర్కొనబడిన అల్లాహ్ యొక్క త్రాడు ఏది? అదియే దివ్యమైన ఖుర్ఆన్. దివ్యఖుర్ఆన్ యే కలిసికట్టుగా ముస్లిములందరూ దృఢంగా పట్టుకోవలసిన అల్లాహ్ యొక్క త్రాడు. ఈ వచనంలో రెండు సార్లు నొక్కి చెప్పబడింది. ‘కలిసికట్టుగా దృఢంగా అందరూ కలిసి పట్టుకోండి’ అని చెప్పడమే కాకుండా ‘విభజింపబడ వద్దు’ అని కూడా చెప్పబడింది. ఇంకా ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది,"అల్లాహ్ కు విధేయత చూపండి, మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకు విధేయత చూపండి "                [ఖుర్ఆన్ 4:59]ముస్లిములందరూ ఖుర్ఆన్ ను మరియు ప్రామాణికమైన హదీథులను తప్పనిసరిగా అనుసరించాలి మరియు తమలో తాము వేర్వేరు వర్గాలుగా విడిపోకూడదు. 2.   వేర్వేరు గ్రూపులు మరియు వర్గాలుగా విడిపోవడం ఇస్లాం ధర్మంలో నిషేధించబడిందిదివ్యఖుర్ఆన్ ఇలా తెలుపుతున్నది: "ఎవరైతే తమ ధర్మాన్ని విభజిస్తారో, మరియు వర్గాలుగా విడగొడతారో, వారి కొరకు కొంచెం కూడా మిగిలి ఉండదు:వారి విషయం అల్లాహ్ వద్ద ఉంటుంది:అతడు పతన స్థితిలో ఉంటాడు వారు ఏమి చేసిన దానిలోని నిజాలన్నింటినీ వారికి చెప్పు."           [ఖుర్ఆన్ 6:159]ఎవరైతే తమ ధర్మాన్ని విభజిస్తూ వివిధ గ్రూపులుగా విడదీస్తారో, అలాంటి వారికి దూరంగా ఉండమని అల్లాహ్ ఈ వచనంలో ఆదేశిస్తున్నాడు.కానీ ఎవరైనా ఒక ముస్లింను, "నీవు ఎవరివి?" అని అడిగినపుడు, మామూలుగా వచ్చే జవాబు ఏమిటంటే ‘నేను సున్నీ’, లేదా ‘నేను షియా’. కొంతమంది తమను తాము ‘హనఫీ’ లేదా ‘షాఫయీ’ లేదా ‘మలికీ’ లేదా ‘హంబలీ’ అని కూడా చెప్పుకుంటారు. మరికొంతమంది ‘నేను దేవబందీ’ అనీ, మరికొంతమంది ‘నేను బరేల్వీ’ అనీ చెప్పుకుంటారు.  3.   మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లింఎవరైనా అలాంటి ముస్లింలను, "మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు? ఆయన హనఫీయా లేక షాఫయీయా లేక మలికీయా లేక హంబలీయా?"  అని అడిగితే, లేదు! ఆయనకు పూర్వం వచ్చిన అల్లాహ్ యొక్క ఇతర ప్రవక్తల మరియు సందేశహరుల వలే ఆయన కూడా ఒక ముస్లిం అని జవాబిస్తారు. దివ్యఖుర్ఆన్ లోని మూడవ అధ్యాయం, 52వ వచనంలో ప్రవక్త జీసస్ అలైహిస్సలాం ‘ముస్లిం’ అని పేర్కొనబడింది.ఇంకా, దివ్యఖుర్ఆన్ లోని మూడవ అధ్యాయం, 67వ వచనంలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు, కానీ ఆయన ఒక ముస్లిం అని అల్లాహ్ పేర్కొన్నాడు. 4.   మిమ్మల్ని మీరు ముస్లిం అని పిలుచుకోవాలని ఖుర్ఆన్ గ్రంథం చెబుతున్నదిa.    ఒకవేళ ఎవరైనా ఒక ముస్లింను నీవు ఎవరివి అని అడిగితే అతను "నేను ఒక ముస్లింను, హనఫీను కాదు లేక షాఫయీను కాదు లేక మలికీను కాదు లేక హంబలీను కాదు" అని జవాబివ్వాలి. దివ్యఖుర్ఆన్ లోని 41వ అధ్యాయం అయిన సూరహ్ ఫుస్సిలత్ లోని 33వ వచనం ఇలా చెబుతున్నది,"అల్లాహ్ వైపు పిలిస్తూ, మంచి పనులు చేస్తూ, ‘నేను ముస్లింలలోని వాడిని?’ అని  పలికేవాని మాటకంటే                                      ఎవరి మాట ఉత్తమమైంది కాగలదు "               [ఖుర్ఆన్ 41:33]    మరోచోట ఖుర్ఆన్ ఇలా చెబుతున్నది "ఇస్లాం ధర్మంలో రుకూ చేసేవారిలోని వాడినని చెప్పు". మరోమాటలో "నేను ఒక ముస్లింను" అని చెప్పు.b.    ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుప్రక్కల ఉన్న ముస్లిమేతర రాజులకు మరియు పాలకులకు ఇస్లాం స్వీకరించమని ఆహ్వానిస్తూ లేఖలు పంపారు. ఆ ఉత్తరాలలో ఆయన దివ్యఖుర్ఆన్ లోని మూడవ అధ్యాయమైన సూరహ్ ఆలె ఇమ్రాన్ లోని ఈ 64వ వచనాన్ని పేర్కొన్నారు:ప్రకటించు: "సాక్ష్యంగా ఉండండి - మేము ముస్లింలని ప్రకటిస్తున్న మా పలుకులకు."                [ఖుర్ఆన్ 3:64]5.   ఇస్లాం ధర్మంలోని గొప్ప పండితులందరినీ గౌరవించాలిమనం తప్పకుండా నలుగురు ఇమాములైన ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ షాఫయీ, ఇమామ్ మాలిక్, ఇమామ్ ఇబ్నె హంబల్ (అల్లాహ్ వారందరినీ స్వీకరించుగాక) లతో సహా ఇస్లాం ధర్మంలోని గొప్ప పండితులందరినీ గౌరవించాలి. వారందరూ గొప్ప పండితులు మరియు వారి నిశిత పరిశోధనలకు మరియు పడిన ప్రయాసలకు బదులుగా అల్లాహ్ అనేక పుణ్యాలు ప్రసాదించుగాక! ఒకవేళ ఎవరైనా ఇమామ్ అబూ హనీఫా లేదా ఇమామ్ షాఫయీ లేదా ఇమామ్ మాలిక్ లేదా ఇమామ్ ఇబ్నె హంబల్ లలో ఎవరో ఒకరి అభిప్రాయాలను మరియు పరిశోధనలను ఇష్టపడితే, ఎవరికైనా ఎలాంటి అభ్యంతరమూ ఉండరాదు. అయితే, ‘నీవు ఎవరివి?’అని ప్రశ్నింపబడినపుడు, ‘నేను ఒక ముస్లింను’ అని మాత్రమే జవాబివ్వాలి.సునన్ అబూ దాఊద్ లోని హదీథు నెం 4579 ను ఉదహరిస్తూ ఈ హదీథులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం "నా సమాజం డెబ్బై మూడు వర్గాలలో విడిపోతుందని" చెప్పారని కొందరు వాదించవచ్చు. డెబ్బై మూడు వర్గాలు ఏర్పడతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణి తెలిపారని ఈ హదీథు తెలుపుతున్నది. అంతేగానీ వివిధ వర్గాలుగా విడిపోవడంలో ముస్లింలు చురుకుగా పాల్గొనాలని ఆయన చెప్పలేదు. గ్రూపులను సృష్టించవద్దని దివ్యఖుర్ఆన్ మనల్ని ఆజ్ఞాపిస్తున్నది. ఎవరైతే ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథుల బోధనలను అనుసరిస్తూ, గ్రూపులను సృష్టించరో, అలాంటివారే ఋజుమార్గం పై ఉన్నవారు. తిర్మిథీ హదీథు గ్రంథంలోని 171వ హదీథులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారని నమోదు చేయబడింది, "నా సమాజం డెబ్బై మూడు వర్గాలుగా విడిపోతుంది. వాటిలో ఒక్క వర్గం తప్ప మిగిలినవన్నీ నరకంలో పడవేయబడతాయి." అది విని సహచరులు ‘ఆ వర్గం ఏదై ఉంటుంది?” అని ప్రశ్నించగా, ఆయన ఇలా జవాబిచ్చారు, "ఆ వర్గం అదే దేనికైతే నేనూ మరియు నా సహచరులూ చెందుతారో."దివ్యఖుర్ఆన్ అనేక వచనాలలో, "అల్లాహ్ కు విధేయత చూపండి మరియు ఆయన ప్రవక్తకు" అని ఆదేశించింది. ఒక నిజమైన ముస్లిం కేవలం దివ్యఖుర్ఆన్ ను మరియు సహీహ్ హదీథులను మాత్రమే అనుసరించాలి. ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథుల బోధనలకు అనుగుణంగా ఉన్నంత వరకు ఏ పండితుడి అభిప్రాయాలనైనా అతడు ఇష్టపడవచ్చు. ఒకవేళ ఆ అభిప్రాయాలు అల్లాహ్ యొక్క దివ్యవచనానికి అంటే ఖుర్ఆన్ కు లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులకు విరుద్ధంగా ఉంటే ఆ అభిప్రాయాలకు ఎలాంటి బరువూ ఉండదు – ఆ పండితుడు ఎంతటి జ్ఞానవంతుడైనా సరే. ఒకవేళ ముస్లిములందరూ అర్థం చేసుకుంటూ ఖుర్ఆన్ చదివితే మరియు సహీహ్ హదీథులను అనుసరిస్తే, ఇన్షా అల్లాహ్ ఈ వ్యత్యాసాలలో అనేక వ్యత్యాసాలు సమసి పోతాయి మరియు మనం ఒక్క ముస్లిం సమాజంగా ఏకమైపోతాము. సహజంగా మతాలన్నీ మంచి పనులు చేయమనే తమ తమ అనుచరులను ఆదేశిస్తాయి. మరి అలాంటప్పుడు ఎవరైనా ఇస్లాంనే ఎందుకు అనుసరించాలి ? ఇతర ధర్మాల్ని అనుసరించకూడదా ?ఇస్లాం ధర్మానికీ మరియు అనేక ఇతర ధర్మాలకూ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ప్రధానంగా ధర్మాలన్నీ మంచి పనులు చేయమని ప్రోత్సహిస్తాయి మరియు చెడు పనుల నుండి దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తాయి. అయితే ఈ విషయంలో ఇస్లాం ధర్మం మిగిలిన ధర్మాలన్నింటి కంటే ఎంతో ముందున్నది. ధర్మబద్ధత, నైతికత సాధించే ప్రాక్టికల్ పద్ధతుల వైపు ఇస్లాం ధర్మం మార్గదర్శకత్వం వహిస్తున్నది. అంతటితో ఆగక మన వ్యక్తిగత మరియు సామూహిక జీవితాలలో నుండి చెడును, దుష్టత్వాన్ని తొలగించే సన్మార్గాన్ని చూపుతున్నది. మానవ సహజ గుణగణాలను మరియు మానవ సమాజ చిక్కు సమస్యలను అది పరిగణలోనికి తీసుకుంటోంది. సృష్టికర్త స్వయంగా చూపుతున్న సన్మార్గమే ఇస్లాం ధర్మం. కాబట్టి, దీనుల్ ఫిత్రహ్ (సహజసిద్ధమైన ధర్మం) అనే పేరుతో కూడా ఇస్లాం ధర్మం పిలవబడుతోంది. ఉదాహరణ – దొంగతనాన్ని ఇస్లాం ధర్మం నిషేధించడమే కాకుండా దానిని నిర్మూలించే పద్దతిని కూడా నిర్దేశించింది.a. దొంగతనాన్ని నిర్మాలించే పద్ధతిని ఇస్లాం ధర్మం నిర్దేశించింది:     దొంగతనం ఒక చెడు పని అని దాదాపు మతాలన్నీ బోధిస్తాయి. ఇస్లాం కూడా ఇదే విషయాన్ని బోధిస్తుంది. మరి ఇస్లాం ధర్మానికి మరియు ఇతర ధర్మాలలో తేడా ఎక్కడ ఉంది? ఎక్కడ తేడా ఉందంటే – దొంగతనం ఒక చెడు పని అని బోధించడమే కాకుండా ఇస్లాం ధర్మం ప్రజల్ని దొంగతనం చేయకుండా ఆపే ఒక సామాజిక వ్యవస్థను ఎలా సృష్టించాలో చక్కటి ప్రాక్టికల్ దారిని చూపుతున్నది.             b. జకాతు విధిదానాన్ని ఇస్లాం ధర్మం నిర్దేశించింది: జకాతు విధి దాన వ్యవస్థను (వార్షిక తప్పనిసరి దాన పద్ధతి) ఇస్లాం ధర్మం నిర్దేశించింది. ప్రతి వ్యక్తి నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ అంటే 85 గ్రాముల బంగారం విలువ కంటే ఎక్కువ మిగులు సంపదలో నుండి ప్రతి చాంద్రమాన సంపత్సరం 2.5% దానం చేయ వలసి ఉంటుంది. ఒకవేళ ప్రపంచంలోని ప్రతి ధనవంతుడు త్రికరణశుద్ధిగా జకాతు విధి దానం చేస్తే, ఈ ప్రపంచంలో నుండి పూర్తిగా బీదరికాన్ని మాయం చేయవచ్చు. ఒక్క మనిషి కూడా ఆకలిలో చావడు.            c. దొంగతానానికి శిక్షగా చేతులు నరకడం :దొంగతనం చేసినట్లు ఋజువైన దొంగల చేతులు నరకమని ఇస్లాం ధర్మం నిర్దేశిస్తున్నది. దివ్య ఖుర్ఆన్ లోని సూరతుల్ మాయిదహ్ అధ్యాయంలో అల్లాహ్ ఆజ్ఞ ఇలా ఉన్నది:"ఇక దొంగ విషయానికి వస్తే – మగ దొంగైనా లేక ఆడ దొంగైనా, అతని/ఆమె చేతులు నరకాలి. వారు చేసిన నేరానికి అల్లాహ్ విధించిన కఠినశిక్షకు ఉపమానంగా: అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, సంపూర్ణ వివేకవంతుడూను." [దివ్యఖుర్ఆన్ 5:38]ముస్లిమేతరులు, "ఈ నాగరిక 20వ శతాబ్దంలో చేతులు నరకడమా! ఇస్లాం అంత అనాగరక మరియు క్రూర ధర్మం మరొకరటి లేదు." అంటారు. అలా అనేవారు సమాజంలో నుండి దొంగతనాన్ని నిర్మూలించగలిగే ఈ పద్ధతి కంటే మరేదైనా ఉత్తమ పద్దతిని కనిపెట్టగలిగారా ?            d. ఇస్లామీయ షరిఅహ్ అమలు చేస్తే వచ్చే ఫలితాలు:ప్రపంచంలోని ఆధునిక దేశాలలో అమెరికా ఒక అత్యాధునిక దేశంగా మరియు అత్యంత ధనిక దేశంగా గుర్తించబడింది. కానీ, అది దురదృష్టవశాత్తు దోపిడీదొంగతనాలలో అత్యధిక క్రైమ్ రేటుతో అన్ని దేశాల కంటే ముందున్నది. ఒకవేళ అమెరికాలో ఇస్లామీయ షరిఅహ్ ధర్మచట్టాన్ని ఆచరణలో పెడితే, అంటే ప్రతి ధనవంతుడు తప్పకుండా జకాతు విధి దానం చేస్తే అంటే ప్రతి చాంద్రమాన సంవత్సరం 85 గ్రాముల కంటే ఎక్కువ మిగులు సంపదలో నుండి 2.5% బీద ప్రజలలో దానం చేస్తే మరియు దొంగతనం చేసినట్లు ఋజువైన ప్రతి నేరస్థుడికి చేతులు నరికి వేసే శిక్ష విధిస్తే, అమెరికాలో క్రైమ్ రేట్ పెరుగుతుందా లేక తగ్గుతుందా ? సహజంగానే అది తగ్గిపోతుంది కదా! అంతేగాక అలాంటి కఠిన చట్టం దొంగతనం చేయాలనే ఆలోచనతో ఉన్న వారిని కూడా నిరుత్సాహ పరుస్తుంది. ప్రపంచంలో ఈనాడు జరుగుతున్న దొంగతనాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం వలన ఒకవేళ దొంగల చేతులు నరికే శిక్ష ఆచరణలో పెడితే చేతులు నరకబడే నేరస్థుల సంఖ్య వందలో వేలలో ఉంటుందేమో అనే మాటతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఇక్కడ గుర్తించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఈ కఠినశిక్ష ఆచరణలో పెట్టడం ప్రారంభమైన క్షణం నుండే దొంగతనాల సంఖ్య ఆటోమేటిక్ గా తగ్గిపోవడం మొదలవుతుంది. తన చేతులు పోగొట్టుకోవలసి వస్తుందనే భయంతో దొంగతనం చేయాలని ఆలోచిస్తున్న నేరస్థులు అడుగు ముందుకు వేసే ముందు పునరాలోచనలో పడిపోతారు. కేవలం కఠినశిక్ష పడుతుందనే ఆలోచనే అనేకమంది దొంగలను ఆ చెడు పని చేయకుండా ఆపుతుంది. చివరికి అట్టి పరిస్థితిలో కూడా దొంగతనానికి పాల్బడే నేరస్థులు అతి కొద్ది మంది మాత్రమే మిగులుతారు. కాబట్టి, దొంగతనం చేసిన నేరానికి చేతులు నరకబడే వారి సంఖ్య నామమాత్రం అయిపోతుంది మరియు మిలియన్ల కొద్దీ ప్రజలు దొంగతనాల భయం లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు. కాబట్టి ఇస్లామీయ షరిఅహ్ ఆచరణాత్మకమైనది మరియు చిత్తశుద్ధితో అమలు చేస్తే అద్భుత ఫలితాలు సాధించగలదు. మహిళలపై అత్యాచారాలను మరియు మానభంగాలను ఇస్లాం ధర్మం నిషేధిస్తున్నది : పరదా చేయాలని   ఆదేశిస్తున్నది మరియు రేప్ చేసిన నేరస్థులకు మరణశిక్ష విధిస్తున్నది:a.    మానభంగాలను మరియు అత్యాచారాలను నిర్మూలించే పద్ధతిని ఇస్లాం ధర్మం నిర్దేశిస్తున్నది: మహిళలపై అత్యాచారాలు మరియు మానభంగాలు ఘోరమైన పాపాలను మతాలన్నీ ఘోషిస్తున్నాయి. ఇస్లాం ధర్మం కూడా ఇదే బోధిస్తున్నది. మరి, ఇస్లాం ధర్మానికి మరియు ఇతర ధర్మాలకూ మధ్య ఉన్న తేడా ఏమిటి ? ఆ వ్యత్యాసం ఏమిటంటే, మహిళలను గౌరవించాలని బోధిస్తూ మరియు వారిపై మానభంగం మరియు అత్యాచారం చేయడమనేది గంభీరమైన పాపంగా అసహ్యించుకోవడంతోటే ఇస్లాం ధర్మం ఆగిపోవడం లేదు. అలాంటి నేరాలను సమాజంలో నుండి ఎలా నిర్మూలించాలో ఖచ్చితంగా చూపుతున్నది.  b.    పురుషుల హిజాబ్ అంటే పరదా:ఇస్లాం ధర్మం పరదా వ్యవస్థను నిర్దేశిస్తున్నది. దివ్యఖుర్ఆన్ లో ముందుగా పురుషుల కొరకు పరదా పేర్కొనబడింది, ఆ తర్వాత మహిళల పరదా గురించి పేర్కొనబడింది. క్రింది ఖుర్ఆన్ వచనంలో పురుషుల కొరకు పరదా గురించి ప్రసావించబడింది.:"(ఓ ప్రవక్తా) ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారికొరకు పవిత్రమైనదనీ వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు." [ఖుర్ఆన్ 24:30]ఒక వ్యక్తి చూపు ఒక మహిళపై పడగానే, ఒకవేళ అతని మనస్సులో ఏదైనా సిగ్గుమాలిన చెడు ఆలోచన వస్తే, వెంటనే అతడు తన చూపును క్రిందికి దించుకోవలెను. ఇంకోమాటలో, ఆకస్మాత్తుగా పడే చూపును వెంటనే మరల్చుకోవాలి మరియు కావాలని మరలా ఆమె వైపు చూడకూడదు. c.    మహిళల హిజాబ్ అంటే పరదా:క్రింది ఖుర్ఆన్ వచనంలో మహిళల కొరకు ఆదేశించబడిన పరదా గురించి ప్రస్తావించబడింది :"(ఓ ప్రవక్తా) ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బయటికి కనబడే వాటిని తప్ప – తమ అలంకరణను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై ఓణీలు కప్పుకోవాలనీ, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కాచెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలిసి మెలిసి ఉండే స్త్రీలు, లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా లోబడి ఉండే పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా ఎరుగని బాలురు – వీళ్ళ ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను (అందచందాలను) కనబడకూడనివ్వకూడదనీ, దాగి వున్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు....." [ఖుర్ఆన్ 24:31] మహిళల కొరకు నిర్దేశించబడిన పరదాలో ఆమె మొత్తం శరీరం వస్తుంది. అంటే ఆమె తన మొత్తం శరీరాన్ని కప్పుకోవాలి. కొందరు పండితులు ఆమె ముఖానికి మరియు మణికట్టు వరకు చేతులకు మినహాయింపు ఉందని అభిప్రాయపడినారు. అయితే, వాటిని కూడా కప్పుకోవడం ఉత్తమం. కొందరు పండితులు తప్పనిసరిగా ముఖం కూడా కప్పుకోవాలని అభిప్రాయపడినారు. d.    హిజాబ్ అంటే పరదా వ్యవస్థ అత్యాచారాలను నివారిస్తుంది :మహిళలపై హిజాబ్ అంటే పరదా వ్యవస్థను అల్లాహ్ ఎందుకు నిర్దేశించాడనే దానికి సూరతుల్ అహజాబ్ యొక్క క్రింది వచనంలో జవాబు ఇవ్వబడింది:"ఓ ప్రవక్తా! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపులకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడూ, కనికరించేవాడూను." [Al-Qur’an 33:59]పతివ్రతలుగా గుర్తించబడేందుకు, తద్వారా అత్యాచారాలకు గురికాకుండా కాపాడబడేందుకు గాను హిజాబ్ అంటే పరదా మహిళలపై ఆదేశించబడిందని ఖుర్ఆన్ చెబుతున్నది. e.    ఇద్దరు కవల సోదరీమణుల ఉపమానం :ఉదాహరణకు ఎంతో అందంగా ఉన్న ఇద్దరు సోదరీమణులు ఒక రోడ్డుపై నడిచి వెళ్ళుచున్నారు. ఇద్దరిలో ఒకామె ఇస్లామీయ పద్ధతిలో హిజాబ్ అంటే పరదా ధరించింది, రెండో ఆమె మిని స్కర్ట్ ధరించింది. వీధి చివరిలో ఒక పోకిరీ వెధవ అమ్మాయిలను వేధించే అవకాశం కోసం కాచుకుని ఉన్నాడు. వీరిద్దరిలో అతడు ఎవరి వెంటపడతాడు? హిజాబ్ అంటే పరదా ధరించి ఉన్న అమ్మాయినా లేక మినీ స్కర్ట్ ధరించిన అమ్మాయినా? ధరించటం వలన శరీరాన్ని దాచటం కంటే మరింత ఎక్కువగా బయట పెడుతున్న దుస్తులు ఎదుటి మగవారిలో దుర్భుద్ధి పుట్టించి, ఆమె వెంటపడి వేధించేలా, ఆమెపై అత్యాచారం మరియు మానభంగం చేసేలా ప్రేరేపిస్తాయి. కాబట్టి, హిజాబ్ అంటే పరదా స్త్రీలను అత్యాచారం నుండి కాపాడుతుందనే ఖుర్ఆన్ వాక్కు నిజమైనదేనని ఋజువు అవుతున్నది. f.     మానభంగం చేసిన నేరస్థుడిని మరణశిక్ష విధించాలి :మానభంగం చేసినట్లు ఋజువైన నేరస్థుడికి మరణశిక్ష విధించాలని ఇస్లామీయ షరిఅహ్ నిర్దేశిస్తున్నది. ఈ ఆధునిక కాలంలో అలాంటి దారుణ శిక్షలేమిటని ముస్లిమేతరులు ఆందోళన చెందవచ్చు. ఇస్లాం ధర్మం కనికరం లేనిదని, క్రూరమైందని మరియు అనాగరికమైందని అనేక మంది ఆరోపిస్తూ ఉంటారు. అనేక మంది ముస్లిమేతరులను ఈ ప్రశ్న అడగడం జరిగింది – ఉదాహరణకు, (అల్లాహ్  కాపాడుగాక), ఒకవేళ ఎవరైనా మీ భార్యను లేదా మీ తల్లిని లేదా మీ సోదరిని మానభంగం చేసారు మరియు మీరే ఆ కేసులో జడ్జిగా నియమించబడినారు. మానభంగం చేసిన నేరస్థుడు మీ ముందుకు తీసుకురాబడ్డాడు. మీరు అతడికి ఏ శిక్ష విధిస్తారు? దానికి వారందరూ, "మేము అతడికి మరణశిక్ష విధిస్తాము." అని జవాబిచ్చారు.  కొంతమంది మరికొంచెం ముందుకు పోయి, "చనిపోయేవరకూ మేము అతడిని హింసిస్తాము" అని ఆవేశంతో ఊగిపోతూ జవాబిచ్చారు. ఒకవేళ మీ భార్య లేక తల్లి లేక సోదరి మానభంగానికి గురైతే నేరస్థుడికి మరణశిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారే, మరి ఇంకొకరి భార్య లేదా తల్లి లేదా సోదరి మానభంగానికి గురైతే ఆ నేరస్థుడికి విధించబడే మరణశిక్ష దారుణమైంది, క్రూరమైంది మరియు అనాగరికమైందని మీరెలా అనగలుగుతున్నారు ?  ఎందుకీ డబుల్ స్టాండర్డ్స్ అంటే ద్వంద్వప్రమాణాలు?g.    అమెరికా అత్యంత ఎక్కువ మానభంగ నేరాల సంఖ్య కలిగి ఉన్నది:అమెరికా ప్రపంచంలోని అత్యాధునిక దేశాలలో ఒకటి. అయితే అక్కడ 1,02,555 రేప్ కేసులు నమోదు చేయబడినట్లు 1990వ సంవత్సరపు F.B.I రిపోర్టు తెలుపుతున్నది. అంతేగాక జరిగిన మానభంగాలలో కేవలం 16% కేసులు మాత్రమే నమోదు చేయబడినట్లు కూడా పేర్కొన్నది. కాబట్టి 1990లో జరిగిన అసలు మానభంగాల సంఖ్య తెలుసుకోవటానికి, నమోదు చేయబడిన సంఖ్యను 6.25తో హెచ్చించగా, 1990లో 6,40,968 రేప్ కేసులు జరిగినట్లు తెలుస్తున్నది. ఒకవేళ ఆ మొత్తాన్ని 365 సంఖ్యతో విభజిస్తే, ప్రతిరోజు దాదాపు 1,756 రేప్ కేసులు జరిగినట్లు గుర్తించగలము. తర్వాత మరో రిపోర్టులో ప్రతిరోజు అమెరికాలో దాదాపు 1900 కేసులు జరుగుతున్నట్లు తెలుపబడింది. నేషనల్ క్రైమ్ విక్టిమైజేజషన్ సర్వే బ్యూరో ఆఫ్ జస్టిస్ స్టాటిస్టిక్స్ (National Crime Victimization Survey Bureau of Justice Statistics (ﷻ‬. S. Dept. of Justice)) ప్రకారం కేవలం 1996లోనే 3,07,000 రేప్ కేసులు జరిగినట్లు నమోదు చేయబడింది. అసలు జరిగిన రేప్ కేసులలో కేవలం 31% మాత్రమే నమోదు చేయబడినాయి. అంటే 1996లో 3,07,000 X 3.226 = 9,90,322 రేప్ కేసులు జరిగాయి. దీనిని బట్టి 1996లో అమెరికాలో ప్రతిరోజు దాదాపు 2,713 రేప్ కేసులు జరిగాయి. అంటే అమెరికాలో ప్రతి 32 సెకన్లకు ఒక రేప్ కేసు జరిగింది. బహశా అమెరికన్ రేపిస్టులు చాలా ధైర్యవంతులేమో. 1990వ సంత్సరపు FBI రిపోర్టులో ఇంకా ఇలా ఉన్నది – నమోదు చేయబడిన రేప్ కేసులలో కేవలం  10%  రేపిస్టులు మాత్రమే అంటే అసలు రేపిస్టుల సంఖ్యలో కేవలం 1.6% మాత్రమే అరెష్టు చేయబడినారు. అలా అరెష్టు చేయబడిన వారిలో కూడా 50% మంది కోర్టులో విచారణ ప్రారంభం కాకముందే విడుదలై పోయారు. అంటే కేవలం 0.8% రేపిస్టులు మాత్రమే కోర్టులో విచారించబడినారు. ఇంకో మాటలో, ఒకవేళ ఎవరైనా 125 మానభంగాలు చేస్తే అతడు కేవలం ఒక్క రేప్ కేసులో మాత్రమే శిక్షించబడతాడు. అనేక మంది దీనిని లాభదాయకమైన జూదంగా పరిగణిస్తున్నారు. ఇంకా ఆ రిపోర్టు ఇలా తెలుతున్నది – అమెరికా దేశ చట్టం ప్రకారం రేపిస్టులకు 7 ఏళ్ళ జైలు శిక్ష విధించబడే అవకాశం ఉన్నా, కోర్టులో విచారించబడిన వారిలో 50% నేరస్థులకు సంవత్సరం కంటే తక్కువ జైలు శిక్ష మాత్రమే విధించబడింది. మొదటిసారి రేప్ కేసులలో పట్టుబడిన వారి విషయంలో జడ్డిగారు చాలా ఉదారంగా వ్యవహరించారు. ఒక్కసారి ఆలోచించండి – ఎవరైనా వ్యక్తి 125 మానభంగాలు చేస్తే, అతడికి శిక్షబడే అవకాశం కేవలం ఒక్కసారి మాత్రమే మరియు వారిలో కూడా 50% నేరస్థులపై జడ్జిగారు ఉదారంగా వ్యవహరించి, సంవత్సరం కంటే తక్కువ జైలుశిక్ష విధించే అవకాశం  ఎక్కువగా ఉంది!h.    ఇస్లామీయ షరిఅహ్ ఆచరణలో పెట్టబడితే వచ్చే ఫలితాలు:ఒకవేళ అమెరికాలో ఇస్లామీయ షరిఅహ్ ఆచరణలో పెట్టబడిందని అనుకుందాం. ఎవరైనా వ్యక్తి చూపు పరస్త్రీ పై పడగానే, ఒకవేళ అతని మనస్సులో ఏదైనా చెడు ఆలోచన వస్తే, వెంటనే అతడు తన చూపు క్రిందికి దించుకుంటాడు. ప్రతి మహిళ హిజాబ్ అంటే పరదా ధరిస్తుంది. ఇంతగా ముందు జాగ్రతలు తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా వ్యక్తి మానభంగం చేస్తే, అతడికి మరణశిక్ష విధించబడుతుంది. మరి ఇలాంటి స్థితిలో, అమెరికాలో మానభంగాల సంఖ్య పెరుగుతుందా, హెచ్చుతగ్గులు లేకుండా అలాగే నిలకడగా ఉంటుందా లేక తగ్గుతుందా? సహజంగానే అది తగ్గిపోతుంది. అంటే ఇస్లామీయ షరిఅహ్ మంచి ఫలితాల్ని సాధిస్తుంది. ఇస్లాం ధర్మంలో మానవజాతి సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు ఉన్నాయి. ఇస్లామీయ జీవితం అత్యుత్తమ జీవిత విధానం. ఎందుకంటే దాని బోధనలు కేవలం సిద్ధాంతాలు మాత్రమే కాదు. అవి మానవజాతి సమస్యలకు అసలైన ఆచరణాత్మక పరిష్కారాలు. వ్యక్తిగత మరియు సామూహిక స్థాయిలు రెండింటిలో కూడా ఇస్లాం ధర్మం మంచి ఫలితాల్ని ఇస్తుంది. ఇస్లాం ధర్మం అత్యుత్తమ జీవన విధానం ఎందుకంటే అది ఆచరణాత్మకమైన, సర్వసామాన్యమైన, విశ్వవ్యాప్తమైన మరియు సార్వజనిక ధర్మం. అది ఏదో ఒక నిర్దిష్ట జాతికి, తెగకు, వర్గానికి లేదా ఒక దేశానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఒకవేళ ఇస్లాం ధర్మం అత్యుత్తమ మైనదే అయితే, మరి అనేకమంది ముస్లింలు నమ్మదగనివారుగా, నిజాయితీ లేనివారుగా ఎందుకు పేర్కొనబడుతున్నారు మరియు మోసం, దగా, వంచన, లంచాలు ఇచ్చిపుచ్చుకోవడం, మత్తుపదార్థాల వ్యాపారం చేయడం మొదలైన వాటిలో ఎందుకు మునిగి ఉన్నారు ?1.   ఇస్లాం ధర్మాన్ని మీడియా అపఖ్యాతి పాలు చేస్తున్నదినిస్సందేహంగా ఇస్లాం ధర్మం అత్యుత్తమమైన ధర్మం. కానీ మీడియా ఇస్లాం ధర్మానికి భయపడే పాశ్చాత్యుల చేతుల్లో ఉంది. ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా మీడియా నిరంతరం సమాచారాన్ని ప్రసారం చేస్తున్నది మరియు ప్రచురిస్తున్నది. అది ఇస్లాం గురించి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నది, తప్పుగా ఉదహరిస్తుంది లేదా ఏదైనా అంశాన్ని అసందర్భరూపంలో చూపుతుంది.ఎక్కడైనా బాంబు పేలినపుడు, ఎలాంటి ఋజువు లేకుండా ముందుగా నేరారోపణ చేయబడేది ముస్లింల పైనే. ముస్లిం టెర్రిరిష్టులే ఈ పని చేసారనే నిరాధారమైన ఆరోపణలు వార్తాపత్రికల హెడ్ లైన్లలో వస్తాయి. కానీ, ఎపుడైతే ఆ బాంబు పేలుళ్ళకు బాధ్యులు ముస్లింలు కాదని, ఎవరో ముస్లిమేతరులని బయటపడినపుడు, పత్రికలలోని లోపల పేజీలలో ఒక మారుమూల ఎలాంటి ప్రాధాన్యత లేని ఒక చిన్న వార్తగా ప్రచురించబడుతుంది – స్వచ్ఛమైన, శాంతియుతమైన ఇస్లాం ధర్మంపై మీడియా ఎందుకు ఈ పక్షపాతం చూపుతున్నది ? ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి, పెడదారి పట్టిస్తున్నది ?ఒకవేళ ఎవరైనా 50 ఏళ్ళ ముస్లిం వ్యక్తి, ఆమె అనుమతితో 15 ఏళ్ళ యువతిని పెళ్ళాడితే, అది హెడ్ లైన్లలో ముందు పేజీలో ప్రచురించబడుతుంది. కానీ ఎవరైనా 50 ఏళ్ళ ముస్లిమేతరుడు ఆరేళ్ళ బాలికను మానభంగం చేస్తే, అది లోపల పేజీలలో ‘సంక్షిప్తవార్త’గా ప్రచురించబడుతుంది. అమెరికాలో ప్రతిరోజూ దాదాపు 2,713 మానభంగాలు జరుగుతున్నాయి, కానీ అవి వార్తలలో కనబడవు. ఎందుకంటే అది అమెరికన్ల జీవితాలలో ఒక సామాన్య విషయమై పోయింది. 2.   ప్రతి సమాజంలో ఉండే కొందరు కులభ్రష్టులు:ప్రతి సమాజంలో వలే ముస్లింలలో కూడా కొందరు వంచకులు, మోసగాళ్ళు, నమ్మకద్రోహులు, రౌడీలు, నేరస్థులు ఉన్నారనేది వాస్తవమే. కానీ, కేవలం ముస్లింలు మాత్రమే అలాంటి చెడు పనులు చేస్తారన్నట్లుగా మీడియా వారిని వేలెత్తి చూపుతున్నది. ప్రతి సమాజంలో కులభ్రష్టులు ఉంటారు. ముస్లింలలో మద్యపానం సేవించేవారున్నారు మరియు ముస్లిమేతరులలో రహస్యంగా మద్యపానం చేసే అనేకమంది కూడా ఉన్నారు. 3.   సగటున ఎక్కువ శాతం ముస్లింలు అత్యుత్తములు:ముస్లిం సమాజంలో కొందరు కులభ్రష్టులున్నా, సగటున చూసినట్లయితే, ప్రపంచంలో అత్యుత్తమ సమాజం ముస్లిం సమాజమే అనే విషయాన్ని ఎవరైనా తేలిగ్గా గుర్తించగలరు. అది మద్యపానానికి దూరంగా ఉన్న అతి పెద్ద సమాజం, ప్రపంచం మొత్తంలో సామూహికంగా అత్యధిక దానధర్మాలు చేసే సమాజం. ఇక నైతిక విలువల విషయంలో, మత్తుపదార్థాల విషయంలో, మానవజాతి విలువల విషయంలో ఇస్లాం ధర్మంపై నడిచే ముస్లింలకు దారి చూపగలిగే వాడు ప్రపంచంలో ఒక్కడు కూడా కనబడడు. 4.   డ్రైవరు ను చూసి కారు గురించి తీర్మానించుకోవద్దు:లేటెష్టు మెర్సిడెస్ మోడల్ కారు మంచిగా ఉందో లేదో కనుక్కోవటానికి మీరు ప్రయత్నిస్తుండగా, నడపడం చేతకాని ఒక డ్రైవరు దాని స్టీరింగు వెనుక కూర్చుని, వంకర టింకరగా నడుపుతూ దేనికో గుద్ది వేయడం మీ కళ్ళపడుతుంది. అది చూసిన మీరు, ఆ ఏక్సిడెంటుకు ఎవరిని కారకులుగా తీర్మానిస్తారు ? ఆ కారునా లేక నడపడం చేతకాని ఆ డ్రైవరునా? సహజంగా ఆ డ్రైవరునే కదా! కారు గురించి తెలుసుకోవటానికి ఎవరైనా దానిని నడిపై డ్రైవరు వైపు చూడడు, కానీ ఆ కారు యొక్క సమర్థత మరియు అది ఎంత వేగంగా పోతుంది, దాని సరాసరి ఇంధన వినియోగం ఎంత, దానిలో భద్రత ఎలా ఉంది .. మొదలైన ప్రత్యేకతలను క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. వాదన కోసం ముస్లింలు దుష్టులని ఒకవేళ అంగీకరించినా, ఇస్లాం ధర్మాన్ని దాని అనుచరుల ప్రవర్తనను బట్టి నిర్ణయించటం న్యాయమేనా ? ఒకవేళ మీరు ఇస్లాం ధర్మం ఎంత మంచిదో కనుక్కోవాలనుకుంటే, దాని ప్రామాణిక మూలగ్రంథాలైన ఖుర్ఆన్ మరియు హదీథుల ఆధారంగా దాని గురించి కనుక్కోండి మరియు నిర్ణయించండి.5.   ఇస్లాం ధర్మాన్ని దాని అత్యుత్తమ అనుచరుని ఆధారంగా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆధారంగా పరిశోధించండి:ఒకవేళ మీరు కారు ఆచరణాత్మకంగా ఎంత మంచిదో తెలుసుకోవాలనుకుంటే, ఒక మంచి నిపుడిని డ్రైవింగ్ సీటుపై కూర్చోపెడతారు. అలాగే ఇస్లాం యొక్క అత్యుత్తమ మరియు అత్యున్నత అనుచరుడైన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఇస్లాం ఎంత మంచిదో కనుక్కోవచ్చు.  ముస్లింలే కాకుండే, అనేకమంది నిష్పక్షపాత మరియు నిజాయితీపరులైన ముస్లిమేతరులు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యుత్తమ మానవుడని ప్రకటించారు. ‘చరిత్రలో అత్యంత ప్రబలమైన వందమంది వ్యక్తులు’ (The Hundred Most Influential Men in History) అనే తన పుస్తకంలో మైకెల్ హెచ్. హార్ట్ (Michael H. Hart), ఇస్లాం ధర్మం యొక్క అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రపంచ ప్రఖ్యాత మానవులందరిలో మొట్టమొదటి ఇచ్చారు. అంతేగాక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ముస్లిమేతరులు ప్రశంసించిన సందర్భాలు లెక్కకు మించి ఉన్నాయి. ఉదాహరణకు థామస్ కార్లయిల్ (Thomas Carlyle), లా మార్టిన్ (La-Martine), etc.

المرفقات

2

ఇస్లాం మరియు ముస్లింలపై కొన్ని ప్రశ్నోత్తరాలు
ఇస్లాం మరియు ముస్లింలపై కొన్ని ప్రశ్నోత్తరాలు